అమెరికాతో ఇరాన్ ఢీ అంటే ఢీ.. అత్యాధునిక ఆయుధాల వీడియో రిలీజ్ చేసిన ఇరాన్ ఆర్మీ!
అమెరికాకు మరోసారి సవాల్ విసిరింది ఇరాన్ ప్రభుత్వం. సొరంగ మార్గాల్లో దాచిన అణ్వాయుధాల వీడియోను విడుదల చేసి తమ ఆయుధ సత్తాను చాటింది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులకు తమ ప్రభుత్వం మద్దతిస్తోందన్న అమెరికా ఆరోపణల్లో నిజం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

అమెరికాకు మరోసారి సవాల్ విసిరింది ఇరాన్ ప్రభుత్వం. సొరంగ మార్గాల్లో దాచిన అణ్వాయుధాల వీడియోను విడుదల చేసి తమ ఆయుధ సత్తాను చాటింది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులకు తమ ప్రభుత్వం మద్దతిస్తోందన్న అమెరికా ఆరోపణల్లో నిజం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది ఇరాన్. తమతో పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తామని ఇరాన్ ఆర్మీ వీడియోను విడుదల చేసింది. టన్సెల్స్‌లో అత్యాధునిక ఆయుధాల వీడియోను ఇరాన్ ఆర్మీ చీఫ్ హోస్సెనీ బఘేరీ విడుదల చేశారు. ఈ వీడియోలో ఖైబర్ షేకాన్స్, ఘద్రహస్, సెజ్జిల్స్, హజ్ ఖాసీమ్స్, పవేహ్ ల్యాండ్ అటాక్ క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ పర్వత ప్రాంతాల్లో ఈ వీడియోను షూట్ చేశారు.
పొడవైన సొరంగాలు, గుహల్లో ఇరాన్ తన ఆయుధాలను దాచిన దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. అణుఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు నెలల గడువు విధించిన సమయంలో ఈ వీడియోను విడుదల చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. 2018లో అమెరికాతో అణు ఒప్పందాన్ని ఇరాన్ రద్దు చేసుకుంది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హూతీలతో తమకు సంబంధం లేని ఇరాన్ స్పష్టం చేసింది. ఈవిషయంలో అనవసర ఆరోపణలు చేస్తే.. అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని ఇరాన్ హెచ్చరించింది.
హౌతీ తిరుగుబాటుదారుల విషయంలో అమెరికా చాలా సీరియస్‌గా ఉంది. హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ అన్ని విధాలా సాయం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. హౌతీ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు అమెరికా సీక్రెట్ ప్లాన్‌ను తయారు చేసింది. అయితే ఇదే సమయంలో ఇరాన్ తన ఆయుధ సత్తాను ప్రదర్శించడం సంచలనం రేపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..