Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foreign Girl Video: రక్ష రక్ష జగదీశ్వర అంటూ ముద్దు ముద్దు మాటలతో శివయ్యను ప్రార్దిస్తోన్న విదేశీ చిన్నారి.. భక్తిపారవశ్యంతో తేలిపోతున్న భక్తులు

ఓ విదేశీ చిన్నారికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో స్పెషల్ ఏమిటంటే.. ఈ విదేశీ చిన్నారి.. తన ముద్దు ముద్దు మాటలతో శివయ్యని ప్రార్ధిస్తోంది. 

Foreign Girl Video: రక్ష రక్ష జగదీశ్వర అంటూ ముద్దు ముద్దు మాటలతో శివయ్యను ప్రార్దిస్తోన్న విదేశీ చిన్నారి.. భక్తిపారవశ్యంతో తేలిపోతున్న భక్తులు
Foreign Girl Shivayya Song
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2022 | 5:06 PM

విదేశీయులు.. భారతీయ హిందూ సనాతన సంప్రదాయాన్ని సంస్కృతిని.. జీవన విధానానికి ఆకర్షితులవుతున్నారు.. కట్టుబొట్టు తినే తిండి నుంచి పూజించే దేవుడి వరకూ హిందూ సంప్రదాయాన్ని ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. తమ చిన్నారులకు కూడా హిందూ దేవుళ్లను పూజించే అలవాట్లు నేర్పిస్తున్నారు. మన సంస్కృతిని అనుసరిస్తూ.. దైవాన్ని ప్రార్థిస్తున్నారు. తాజాగా ఓ విదేశీ చిన్నారికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో స్పెషల్ ఏమిటంటే.. ఈ విదేశీ చిన్నారి.. తన ముద్దు ముద్దు మాటలతో శివయ్యని ప్రార్ధిస్తోంది.

విదేశీ చిన్నారి రక్ష రక్ష జగదీశ్వర, పర్తిపురి పరమేశ్వర అంటూ ముద్దు ముద్దుగా తెలుగులో స్పష్టంగా పాట పాడిన వీడియో నెట్టింట్లో వైరల్ సందడి చేస్తోంది.  అచ్చ తెలుగులో పాట పాడి సందడి చేసిన ఈ చిన్నారి పేరు నాదియా. కజకస్తాన్ దేశస్థురాలు రుస్లానా కూతురు నాదియా. రుస్లానా పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తురాలు. దీంతో తన కూతురు నదియాతో పాటు.. రుస్లానా పుట్టపర్తికి వచ్చిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తిపారవశ్యంతో చిన్నారి పాడిన పాటకు సత్యసాయి భక్తులు ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో నాదియా పాడిన పాట మళ్లీ వైరల్ గా మారింది.

విదేశీ చిన్నారి నోట శివయ్య స్తోత్రమ్

ఇవి కూడా చదవండి

చిన్నారి తెలుగు మాట్లాడే విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరు.. మన పిల్లలు ఆధునికత పేరుతో.. మన సంస్కృతి సంప్రాదయాలను వదిలివేస్తున్నారు.. తెలుగు మాట్లాడడం కూడా కొందరు అవమానంగా భావిస్తున్న నేపథ్యంలో ఈ చిన్నారి నదియా ను చూసి ఎంతైనా నేర్చుకోవాలంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..