Free Ration: ఏపీ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌! నేటి నుంచి ఉచితంగానే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త తెలిపింది. ఈ నెల నుంచి ఏడాదిపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. అంటే ఇప్పటిదాకా కిలో బియ్యం 1 రూపాయికే అందించిన ఏపీ ప్రభుత్వం..

Free Ration: ఏపీ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌! నేటి నుంచి ఉచితంగానే..
AP Ration Shops
Follow us

|

Updated on: Jan 01, 2023 | 5:41 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త తెలిపింది. ఈ నెల నుంచి ఏడాదిపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. అంటే ఇప్పటిదాకా కిలో బియ్యం 1 రూపాయికే అందించిన ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 1 నుంచి ఉచియ బియ్యం పంపిణీ అమలు అవుతుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ శనివారం (డిసెంబర్ 31) అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టి, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు కోటి 46 లక్షల రేషన్‌ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులందరికీ ఏడాదిపాటు ఉచిత బియ్యం అందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులతో సమానంగా నాన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఏ కార్డుదారులకు కూడా ఉచితంగా బియ్యం అందించనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైనా ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ 1967కు లేదా 18004250082 నంబర్‌ను సంప్రదించవచ్చని అరుణ్‌కుమార్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.