LPG Gas Bags: ప్లాస్టిక్‌ సంచుల్లో ఎల్పీజీ గ్యాస్‌ పంపిణీ షురూ..! పీకల్లోతుల్లో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న దాయాది దేశం

పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ప్రజలకు కనీసం వంట గ్యాస్‌ కూడా సరఫరా చేయలేని దయనీయ స్థితిలోకి దిగజారిపోతోంది. ఎల్‌పీజీ గ్యాస్‌ను ఇనుప సిలిండర్లకు బదులు పాలథీన్‌ కవర్లలో వంట గ్యాస్‌ నింపి..

LPG Gas Bags: ప్లాస్టిక్‌ సంచుల్లో ఎల్పీజీ గ్యాస్‌ పంపిణీ షురూ..! పీకల్లోతుల్లో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న దాయాది దేశం
LPG Gas Bags
Follow us

|

Updated on: Jan 01, 2023 | 2:57 PM

పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ప్రజలకు కనీసం వంట గ్యాస్‌ కూడా సరఫరా చేయలేని దయనీయ స్థితిలోకి దిగజారిపోతోంది. ఎల్‌పీజీ గ్యాస్‌ను ఇనుప సిలిండర్లకు బదులు పాలథీన్‌ కవర్లలో వంట గ్యాస్‌ నింపి సరఫరా చేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో గ్యాస్‌ సరఫరా చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం. దీంతో పాక్‌ ప్రజల జీవనం దినదిన గండంగా మారిపోతోంది. ప్లాస్టిక్‌ కవర్లలో గ్యాస్‌ వినియోగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఒకరకంగా ఇంట్లో బాంబ్‌ పెట్టుకున్నట్లే. ఇదంతా తెలిసినా వేరే గత్యంతరం లేక పాక్‌ ప్రజలు వాటినే వాడుతున్నారు.

2007 నుంచి ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో గ్యాస్‌ కనెక్షన్ నిలిచిపోయింది. హంగు నగరంలో రెండేళ్లుగా దెబ్బతిన్న పైప్‌లైన్‌ రిపేర్‌ చేయించకపోవడంతో గ్యాస్‌ సరఫరా జరగడం లేదు. దీంతో కొందరు వ్యాపారులు కంప్రెషర్ల ద్వారా వంట గ్యాస్‌ను ప్లాస్టిక్‌ కవర్లలో నింపి ప్రజలకు విక్రయిస్తున్నారు. ఈ విధమైన గ్యాస్‌ నింపిన ఈ ప్లాస్టిక్‌ కవర్లకు చిన్న ఎలక్ట్రిక్‌ సక్షన్‌ పంప్‌ బిగించి స్టవ్‌కు అమర్చి వినియోగిస్తున్నారు. మరికొందరు కట్టెల పొయ్యి ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.