ఇస్కా కిక్‌బాక్సింగ్ ఛాంపియన్ అరెస్ట్‌.. తెర వెనుక గలీజు పనులు..

లక్షలకోట్ల సంపాదన, లగ్జరీలైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న మాజీ కిక్ బాక్సర్‌ను పోలీసులు గత శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఆ సెలబ్రిటీ చీకటి కోణం వెలుగులోకొచ్చాక అతని అభిమానులందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంతకీ అతనెవరంటే..

ఇస్కా కిక్‌బాక్సింగ్ ఛాంపియన్ అరెస్ట్‌.. తెర వెనుక గలీజు పనులు..
Andrew Tate
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 31, 2022 | 5:32 PM

లక్షలకోట్ల సంపాదన, లగ్జరీలైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న మాజీ కిక్ బాక్సర్‌ను పోలీసులు గత శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఆ సెలబ్రిటీ చీకటి కోణం వెలుగులోకొచ్చాక అతని అభిమానులందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంతకీ అతనెవరంటే..

ఆండ్రూ టేట్ (36).. ఇతనొక అమెరికన్-బ్రిటీష్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఈ మల్టీ-మిలియనీర్, అతని సోదరుడు ట్రిస్టియన్ టేట్ మానవ అక్రమ రవాణా, అత్యాచారం, భయంకర మాఫియాలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై రెమేనియాలో పోలీసులు అరెస్టు చేశారు. రొమేనియన్ న్యూస్ అవుట్‌లెట్ ప్రకారం.. ఇద్దరు బాలికలను కిడ్నాప్‌ చేయడంలో ఆండ్రూ టేట్, అతని సోదరుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రొమేనియాలోని అతని ఇంటిపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఆండ్రూ టేట్‌ సోషల్‌ మీడియాలో చివరిసారిగా పెట్టిన పోస్టు ద్వారా అతన్ని ట్రేస్‌ చేశారు. రొమేనియన్ పిజ్జా చైన్, జెర్రీస్ పిజ్జాలకు సంబంధించిన పోస్ట్‌ అది. అనంతరం రొమేనియాలో ఉన్నట్లు ధృవీకరించుకున్న తర్వాతనే అతని ఇంటిపై దాడి చేసినట్లు రొమేనియన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం టేడ్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ఇతర సోషల్‌ మీడియా ఖాతాలు నిషేధించబడ్డాయి.

ఎవరీ ఆండ్రూ టేట్..

ఆండ్రూ టేట్‌ మాజీ కిక్‌బాక్సర్. ఇస్కా కిక్‌బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌ టైలిట్‌తోపాటు అనేక టైటిళ్లను గెలుచుకున్నాడు. ఇతనికి కోబ్రాటేట్ అనే వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌ను టేడ్‌ కింగ్ కోబ్రా అని పిలుస్తాడు. రియల్ ఎక్స్‌ట్రీమ్ ఫైటింగ్‌కి కామెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. 2016లో టేట్ బిగ్ బ్రదర్ అనే యూకే రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఐతే ఆ మధ్య ఓ మహిళను కొడుతూ హింసిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవ్వడంతో టేట్ ను ఆ ప్రోగ్రాం నుంచి తొలగించారు. అనంతరం టే ప్పీచ్‌ అనే వీడియోలతో సోషల్‌ మీడియాలో బాగా పాపులారిటీ పొందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.