Corona: డ్రాగన్ కంట్రీ డర్టీ యవ్వారం.. ఆందోళన చెందుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. చైనా ప్రభుత్వం గణాంకాలను విడుదల చేయడం మానేసింది. దీంతో అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియడం లేదు.

Corona: డ్రాగన్ కంట్రీ డర్టీ యవ్వారం.. ఆందోళన చెందుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
China Corona
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2022 | 5:33 PM

కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మళ్ళీ విజృంభింస్తోంది. డ్రాగన్ కంట్రీలో కరోనా కల్లోలంపై ఆందోళన వ్యక్తం చేసింది WHO. ఊహించనిస్థాయిలో కరోనా విజృంభించడపై కీలక కామెంట్స్‌ చేశారు WHO చీఫ్‌ టెడ్రోస్‌. చైనాలో నమోదవుతోన్న కేసులు, గుర్తించిన వేరియంట్లపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. సరైన ఇన్ఫర్మేషన్‌ ఇవ్వకపోతే భవిష్యత్‌లో ప్రపంచం తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చైనాలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదుపై తమకు సరైన సమాచారం లేదన్నారు. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోన్న వైరస్‌ను అర్ధం చేసుకోవాలంటే చైనా సహకరించాలన్నారు WHO చీఫ్‌ టెడ్రోస్‌.

అదే సమయంలో చైనాకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే, కరోనా నియంత్రణకు, హైరిస్క్‌లో ఉన్న బాధితుల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. చైనా ప్రభుత్వం గణాంకాలను విడుదల చేయడం మానేసింది. దీంతో అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియడం లేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అక్కడ ఉన్న భయానక పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి . మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. దీంతో శవాలను నింపడానికి ఉపయోగించే శవపేటికలు కూడా తక్కువ అవుతుండడంతో..  మృత దేహాలను ప్లాస్టిక్ పాలిథిన్‌తో కప్పుతున్నారు. ఓమిక్రాన్ సబ్టైప్‌ మిలియన్ల మంది చైనీయులకు సోకింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం 500 కంటే ఎక్కువ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్‌లు చలామణి అవుతున్నందున రాబోయే రోజుల్లో మరింత కోవిడ్ వ్యాపించే  వచ్చే అవకాశం ఉందని WHO హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా నుండి వచ్చే వ్యక్తులపై రక్షణ చర్యలు తీసుకుంటున్న భారతదేశంతో సహా వివిధ దేశాలను WHO చీఫ్ సమర్థించారు. చైనా నుంచి సమగ్ర సమాచారం లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేతలు తమ ప్రజలను కాపాడుకునేందుకు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని.. అది కూడా సరైనదేనని అన్నారు.

2019లో కరోనా వైరస్ వెలుగులోకి

చైనాలోని ఉన్న ప్రస్తుత పరిస్థితిపై తాము ఆందోళన చెందుతున్నామని, కోవిడ్-19 వైరస్‌ను పర్యవేక్షించడానికి , అత్యధిక ప్రమాదంలో ఉన్న వారికి టీకాలు వేయడానికి చైనాను ప్రోత్సహిస్తున్నామని WHO చీఫ్  అన్నారు.  2019 చివరలో చైనాలోని వుహాన్ నగరంలో మొట్టమొదట ఉద్భవించిన కరోనావైరస్.. మూలాన్ని ప్రస్తావిస్తూ.. టెడ్రోస్, “డేటాను పంచుకోవడానికి .. ఈ మహమ్మారి గురించిన అన్ని పరికల్పనలను పరిశీలించడానికి తాము చైనాను సంప్రదిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ