Pope Benedict XVI Death: విషాదం.. మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత.. చికిత్స పొందుతూ తుదిశ్వాస..

మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న మాజీ పోప్ బెనెడిక్ట్ 95 ఏట మరణించారు. బెనెడిక్ట్‌ 9 సంవత్సరాల క్రితం అత్యున్నత పోప్ పదవికి రాజీనామా చేశారు.

Pope Benedict XVI Death: విషాదం.. మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత.. చికిత్స పొందుతూ తుదిశ్వాస..
Pope Benedict XVI Death
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 31, 2022 | 3:53 PM

మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న మాజీ పోప్ బెనెడిక్ట్ 95 ఏట వాటికన్ సిటీలో మరణించారు. బెనెడిక్ట్‌ 9 సంవత్సరాల క్రితం అత్యున్నత పోప్ పదవికి రాజీనామా చేశారు. మాజీ పోప్ బెనెడిక్ట్ XVI అనారోగ్యం సమస్యలతో పదవీవిరమణ చేసిన దశాబ్దానికి వాటికన్ అపార్ట్‌మెంట్‌లో శనివారం మరణించినట్లు అంతర్జాతీయ వార్తల సంస్థలు వెల్లడించాయి. జర్మనీలో జోసెఫ్ రాట్‌జింగర్‌గా జన్మించిన బెనెడిక్ట్.. 2005లో పోప్ పదవికి ఎంపికయ్యారు. పోప్‌గా మారిన సమయంలో అతనికి 78 ఏళ్లు.. ఆ తర్వాత 2013లో బెనెడిక్ట్ రాజీనామా అనంతరం తన చివరి మజిలీని వాటికన్‌లో మేటర్ ఎక్లేసియా కాన్వెంట్‌లో గడిపారు.

బెనెడిక్ట్ వారసుడు.. పోప్ ఫ్రాన్సిస్ అతను అతన్ని తరచుగా సందర్శించేవారని వాటికన్ ప్రతినిధి తెలిపారు. మాజీ పోప్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, అతని వయస్సు కారణంగా అతని పరిస్థితి మరింత దిగజారిందని హోలీ సీ పేర్కొంది. పోప్ ఫ్రాన్సిస్ బుధవారం వాటికన్‌లో ప్రసంగించి.. పోప్ ఎమెరిటస్ బెనెడిక్ట్ కోసం ప్రత్యేక ప్రార్థన చేయమని ప్రేక్షకులను కోరారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని ప్రార్థించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

పోప్ బెనెడిక్ట్ XVI 2013లో పోప్‌ పదవికి రాజీనామా చేసి కేథలిక్ క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో పోప్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో బెనెడిక్ట్‌ ప్రకటించాడు. దాదాపు 600 ఏండ్లలో పోప్ పదవి నుంచి ఇలా అర్ధాంతరంగా వైదొలగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈయన కంటే ముందు 1415లో క్రైస్తవుల రెండు గ్రూపుల మధ్య ఘర్షణల కారణంగా గ్రెగొరీ XII రాజీనామా చేశారు.

బెనెడిక్ట్ 1977 నుంచి 1982 వరకు మ్యూనిచ్ ఆర్చ్ బిషప్‌గా ఉన్న కాలంలో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆయన పదవిలో ఉన్న సమయంలో పలు ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో మాజీ పోప్ 1977 నుంచి 1982 వరకు మ్యూనిచ్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నప్పుడు పలు తప్పులు జరిగాయని అంగీకరించడం చర్చనీయాంశమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..