Happy New Year 2023: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్.. ముందుగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టనున్న ప్రాంతాలివే..

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ ముందే ప్రారంభమైంది. పలుదేశాల్లో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్ స్క్వేర్‌ కొత్త సంవత్సర వేడుకలకు..

Happy New Year 2023: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్.. ముందుగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టనున్న ప్రాంతాలివే..
New Year Celebrations
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 31, 2022 | 3:44 PM

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ ముందే ప్రారంభమైంది. పలుదేశాల్లో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్ స్క్వేర్‌ కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటుంటారు. అటు ఆస్ట్రేలియా, రష్యా సహా పలుదేశాల్లో బారీ స్థాయిలో వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు.

టైమ్ స్క్వేర్.. న్యూయార్క్‌కే గుండెకాయ వంటిది. 2023 లోకి ప్రవేశించడానికి ఒకరోజు ముందే టైమ్ స్క్వేర్ వద్ద దాదాపు ఐదు టన్నుల బరువున్న ఈవ్ బాల్‌కు ట్రయల్స్ నిర్వహించారు. గ్లాస్‌తో తయారైన ఈ ‘ఈవ్ బాల్‌’ వ్యాసం 12 అడుగులుంటుంది. ఈవ్ బాల్‌లోపల 30వేలకు పైగా ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. డిసెంబర్ 31 సాయంత్రం 6గంటల నుంచే టైమ్ స్క్వేర్ వద్ద వేడుకల సంరంబాలు ప్రారంభమవుతాయి. ఈవ్ బాల్‌ను ముందే ఇక్కడ పొడవైన పోల్‌పైకి ఎక్కిస్తారు. సరిగ్గా అర్ధరాత్రికి ఒక నిమిషం ముందు11గంటల59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభంతోపాటు.. మిరుమిట్లు గొలుపుతూ ఈవ్ బాల్‌ పోల్ పైనుంచి కిందికి జారడం ప్రారంభమవుతుంది. 60 సెకన్లలో ఇది కిందికి చేరుకోవడంతో హ్యాపీ న్యూఇయర్ కేరింతలు, బాణాసంచా కాల్చడం ప్రారంభమవుతాయి.

ముందుగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టనున్న ప్రాంతాలివే..

ప్రపంచంలోనే ముందస్తుగా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న ప్రాంతాలు ఐలండ్ దేశం కిరిబతి, ఆస్ట్రేలియా పరిధిలోని క్రిస్టమస్ దీవులు ఫసిఫిక్‌ ఐలాండ్‌లోని టోంగా, న్యూజిలాండ్, సమోవా. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మధ్యాహ్నం 3 గంటల30 నిమిషాలకు ఇవి 2023లోకి ప్రవేశిస్తాయి. అయితే కొత్త సంవత్సరంలోకి ఆలస్యంగా ప్రవేశించే ప్రాంతాలేవంటే.. అమెరికా దీవులైన బేకర్‌, హౌలాండ్‌ దీవులు.. ఇవి జనవరి 1న సాయంత్రం 5గంటల 30 నిమిషాలకు కొత్త సంవత్సంలోకి అడుగుపెడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..