Andhra Pradesh: 2022 విధ్వంసాల ఏడాదిగా మారింది.. వైసీపీ పాలనలో మానసిక క్షోభ.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2022 విధ్వంసాల ఏడాదిగా మారిందన్న ఆయన.. వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారని మండిపడ్డారు...

Andhra Pradesh: 2022 విధ్వంసాల ఏడాదిగా మారింది.. వైసీపీ పాలనలో మానసిక క్షోభ.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
Chandrababu
Follow us

|

Updated on: Dec 31, 2022 | 1:49 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2022 విధ్వంసాల ఏడాదిగా మారిందన్న ఆయన.. వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారని మండిపడ్డారు. అందరి ఆదాయాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు మాత్రమే కాకుండా తానూ మానసిక క్షోభ అనుభవించినట్లు వెల్లడించారు. అందరూ భాద పడుతుంటే జగన్ మాత్రం ఆనందపడుతున్నారని ఆక్షేపించారు. 40 రకాల పన్నులను ప్రజలపై ప్రభుత్వం మోపిందని విమర్శించారు. సీఎం గా పని చేసిన తనకు ఇన్ని రకాలుగా పన్నులు విధించవచ్చన్న విషయం తెలియలేదని ఎద్దేవా చేశారు. నెల్లూరు కోర్టులో ఫైల్ దొంగతనం చేసిన కాకాని ని వదిలిపెట్టనని హెచ్చరించారు.

2023 లో పెను మార్పులు జరగ బోతున్నాయి. వైసీపీలో కూడా ఒక అంతర్ యుద్ధం ప్రారంభం కాబోతోంది. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. జగన్ ఒక్కో ఓటుకు పది వేల రూపాయలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీని ఇంటికి పంపించడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోని రావడం తథ్యం.

– నారా చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత

ఇవి కూడా చదవండి

మరోవైపు.. నర్సీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్.. గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్న ముఖ్యమంత్రి.. ఈ ప్రాంతం రూపురేఖలు మారుస్తామన్నారు. ‘ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి