Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health: చలికాలంలో వేధించే జలుబుకు అల్లంతో చెక్.. అంతే కాకుండా..

వంటగదిలో ఉండే అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఇది కేవలం నోటి మాట కాదు.. ఎంతో మంది ఆరోగ్య నిపుణులు కూడా పరిశోధించి, ధ్రువీకరించిన అక్షర సత్యం ఇది. మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి మెరుగుపడడంలో సహాయపడుతుంది.అందుకే అల్లం లేకుండా భారతీయ వంటలు పూర్తి కానే కావు. ..

Ganesh Mudavath

|

Updated on: Dec 30, 2022 | 9:14 PM

అల్లంను ఎక్కువగా టీలో ఉపయోగిస్తారు. అల్లం సాధారణంగా శీతాకాలపు ఆహారంగా ప్రసిద్ధి.  ఎందుకంటే చలిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అల్లం ఎంతగానో సాయపడుతుంది.  మరి శీతాకాల ఆహారంలో అల్లానికి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిక్ లక్షణాలను నిర్వహించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం వల్ల నొప్పి, వాపు నుంచి తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.

2 / 5
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిన వెంటనే తుమ్ములు, దగ్గు రావడం సహజం. జలుబు, ఫ్లూ నివారణగా అల్లంను చాలా కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. వివిధ వంటకాలలో లేదా పానీయాలలో అల్లం రసం లేదా తురిమిన అల్లం కలపడం ద్వారా  బలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం పొందవచ్చు.

3 / 5
చలికాలంలో చాలా మంది వ్యక్తులకు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ అనేవి పెద్ద సమస్యలుగా ఉంటాయి.  అర టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం వేసి పడుకునే ముందు తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక్క రోజులోనే మీరు ఉపశమనం లభించిన అనుభూతి చెందుతారు.

4 / 5
రోజువారీ ఆహారంలో భాగంగా అల్లాన్ని తీసుకోవడం ద్వారా మీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు. అల్లం పచ్చడి, అల్లం రసం తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
Follow us