- Telugu News Photo Gallery The best Hill stations in Andhra Pradesh for low budget tour Telugu tourism Photos
AP Hill Stations Tour: ఫ్రెండ్స్ తో కొండ ప్రాంతాల్లో చిల్ అవుదామనుకుంటున్నారా..? ఏపీలో బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే..
ఫ్రెండ్స్ తో లాంగ్ ట్రిప్స్ వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు. అందులో చాలా మంది చలికాలంలో కొండ ప్రాంతాలకు వెళ్దామని సూచిస్తుంటారు. అయితే బాగా దూరప్రాంతాలకు వెళ్లడానికి సెలవులు సరిపోవు..
TV9 Telugu Digital Desk | Edited By: Anil kumar poka
Updated on: Dec 30, 2022 | 6:10 PM

న్యూ ఇయర్ సందడి మొదలైంది. చాలా న్యూ ఇయర్ సమయంలో లేదా సంక్రాంతి సమయంలో ఫ్రెండ్స్ తో లాంగ్ ట్రిప్స్ వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు. అందులో చాలా మంది చలికాలంలో కొండ ప్రాంతాలకు వెళ్దామని సూచిస్తుంటారు. అయితే బాగా దూరప్రాంతాలకు వెళ్లడానికి సెలవులు సరిపోవు.. అలాగే బడ్జెట్ కూడా సహకరించదు. అయితే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే బెస్ట్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడకు వెళ్తే సూపర్ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే అక్కడ స్టే చేసేందుకు కూడా అనువుగా ఉంటుంది. రిసార్ట్స్ వంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయడానికి సూపర్ ప్లేసెస్ అవి. పైగా ఎక్కువ మంది జనం కూడా ఉండరు. సో కంఫర్ట్ బుల్ గా మనం ట్రిప్ ను ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఆ హిల్ స్టేషన్స్ ఏంటో.. ఎక్కడున్నాయో ఓ లుక్కేద్దాం.

లంబసింగి ఇది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉంది. దక్షిణ భారతదేశంలో స్టార్ గేజింగ్ చేయడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటి. దట్టమైన అడవి, ఎత్తయిన ప్రదేశం కారణంగా శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ కొండ మీద నుంచి చూస్తే మేఘాలు పాల సముద్రంలా కనబడతాయి. వీటిని చూడడానికి పర్యాటకులు ఎగబడతారు.

అరకు లోయ తూర్పు కనుమల ప్రాంతం వల్ల ఈ కొండ ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇది విశాఖపట్నానికి కేవలం 120 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అరకు హాట్ ఎయిర్ బెలూనింగ్, జలపాతం, ట్రేకింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతానికి దగ్గరగా ప్రసిద్ధి చెందిన బొర్రా గుహలు కూడా ఉన్నాయి.

తిరుమల ఈ ప్రాంతంలో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి నిత్యం వేలాది మంది ఇక్కడకు వస్తుంటారు. ఫ్యామిలీతో తీర్థ యాత్ర అనుభూతిని పొందడానికి ఈ ప్రాంతానికి వెళ్లవచ్చు. తిరుపతి పట్టణానికి కేవలం 20 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి తిరుమల కొండ ఎక్కెటప్పడు అద్భుతమైన ఘాట్ రోడ్ మంచి అనుభూతిని ఇస్తుంది.

హార్స్ లీ హిల్స్ మదనపల్లె పట్టణంలో ఉన్న ఈ కొండ ప్రాంతం ఏప్రిల్, మే నెలల్లో పర్యటనలకు అనుకూలం. బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల నుంచి ఇక్కడకు చాలా సులువుగా చేరుకోవచ్చు. ఇక్కడ సుర్యాస్తమయ్యాన్ని వీక్షిస్తే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. సింపుల్ గా ఓ రోజు పర్యటన కోసం హార్స్ లీ హిల్స్ కు వెళ్లి రావచ్చు.

మారేడుమిల్లి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుందరమైన ప్రాంతం ఇది. వంకరగా ఉన్న రహదారులు. పచ్చని వృక్ష సంపద మనల్ని అలరిస్తాయి. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను బాగా అలరిస్తుంది. ఇక్కడి వ్యూ పాయింట్ నుంచి కొండలను చాలా బాగా చూడవచ్చు. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా పర్యాటకులకు మంచి అనుభూతినిస్తాయి. రాత్రి సమయంలో ఉండడానికి ఇక్కడ చాలా రిసార్ట్ లు అందుబాటులో ఉన్నాయి.

పాపికొండలు అందమైన విహారయాత్రలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఎందుకంటే గోదావరి నదిలో వెళ్తూ అందమైన కొండప్రాంతాలను వీక్షించేందుకు చాలా మంచి ప్రదేశం. గిరిజన ప్రాంతాల మీదుగా యాత్ర సాగుతుంది కాబట్టి అద్భుతమైన గిరిజన సాంప్రదాయల గురించి తెలుసుకోవచ్చు.





























