Minister Roja: మంత్రి రోజా అదిరిపోయే స్టెప్పులు.. యూనివర్సిటీ విద్యార్థినులతో కలిసి అద్భుతమైన డ్యాన్స్..

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి రోజా.. కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపారు. వారితో కలిసి డ్యాన్స్ చేశారు. తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీ యువజన ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన...

Minister Roja: మంత్రి రోజా అదిరిపోయే స్టెప్పులు.. యూనివర్సిటీ విద్యార్థినులతో కలిసి అద్భుతమైన డ్యాన్స్..
Minisster Roja Dance
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 30, 2022 | 6:01 PM

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి రోజా.. కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపారు. వారితో కలిసి డ్యాన్స్ చేశారు. తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీ యువజన ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి ఘన స్వాగతం పలికిన కేఎల్ యూనివర్సిటీ వీసీ, సిబ్బంది.. పుష్పగుచ్ఛం అందించారు. వివేకానంద జన్మదిన వేడుకలలో భాగంగా జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న యువతకు మంత్రి రోజా ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులకు చదువుతోపాటు యూత్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం కూడా ముఖ్యమేనని, ఎదిగేందుకు ఇది చక్కని అవకాశమని అన్నారు. అందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఉదాహరణగా చెప్పవచ్చన్నారు.

రాజకీయాల్లో ఎంతో మంది జగన్ ను ఎదగనీయకుండా కుట్రలు చేసినా.. తప్పుడు కేసులు పెట్టినా ప్రజల్ని తన కష్టాన్ని నమ్ముకొని చిత్తశుద్ధి తో పని చేశారని రోజా అన్నారు. అందుకు ప్రతిఫలంగా ఈ రోజు తిరుగులేని నాయకుడు అయ్యారన్నారు. ఆయనకు ఆదర్శం వివేకానందుడేనని చెప్పారు. అనంతరం యూనివర్సిటీ యువజనోత్సవాలలో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థినులకు బహుమతులు అందించారు.

ఆంధ్రా వాళ్ల సత్తా ఏమిటో జాతీయ ఉత్సవాలలో నిరూపించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్