Red Wine Benefits: రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? పరిశోధనలలో సంచలన విషయాలు

వైన్‌ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రెడ్‌ వైన్‌ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని..

Red Wine Benefits: రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? పరిశోధనలలో సంచలన విషయాలు
Red Wine Benefits
Follow us

|

Updated on: Dec 30, 2022 | 2:00 PM

వైన్‌ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రెడ్‌ వైన్‌ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే రెడ్ వైన్ గురించి ప్రజల మనస్సుల్లో వివిధ ప్రశ్నలు తలెత్తుతుంటాయి.  ముఖ్యంగా ఏదీ తినాలన్నా.. తాగాలన్నా ముందుగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.కొంతమంది సాధారణ ఆల్కహాల్ లాగా ఇది హానికరం అని అనుకుంటారు. రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందో లేదో తెలుసుకుందాం.

రెడ్‌ వైన్‌ ఆరోగ్యానికి ఎందుకు మంచిది?

పాలీఫెనాల్స్ వైన్ ఆరోగ్యంగా పరిగణించబడటానికి కారణం. ఇందులో పాలీఫెనాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. రెడ్ వైన్‌లో వైట్ వైన్ కంటే పది రెట్లు ఎక్కువ పాలీఫెనాల్స్ ఉంటాయి. పరిమిత పరిమాణంలో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చని ఇటాలియన్ శాస్త్రవేత్త అల్బెర్టో బెర్టెల్లి కనుగొన్నారు. భోజనంతో పాటు రోజుకు 160ml వైన్ తాగాలని సిఫార్సు చేయబడింది. వైన్‌కి సంబంధించిన చాలా పరిశోధనలు పాలీఫెనాల్ రెస్వెరాట్రాల్‌పై ఆధారపడి ఉన్నాయి. ద్రాక్ష విత్తనాలలో రెస్వెరాట్రాల్ కనిపిస్తుంది. ఇది ధమనులలో రక్తాన్ని పలుచన చేసి అధిక రక్తపోటును నివారిస్తుందని నమ్ముతారు. బెర్టెల్లి వివరాల ప్రకారం.. అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షించే అనేక రసాయనాలు వైన్‌లో ఉన్నాయి.

రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దాని పరిమాణాన్ని పరిమితం చేయాలి. ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ తీసుకోకూడదు. అలా చేస్తే కూడా నష్టమే అంటున్నారు. రెడ్ వైన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది డిప్రెషన్ నుండి రక్షిస్తుంది. రెడ్ వైన్ తాగడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. అదనంగా ఇది చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. దీంతో చర్మం మెరుస్తుంది. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి-6, విటమిన్ సి రెడ్ వైన్‌లో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది శరీరం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మితిమీరిన మద్యపానం ఒక వ్యసనం వలె అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. అందుకే పరిమితి పరిమాణంలో తాగాలి. మీకు ఇప్పటికే మీ శరీరంలో ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించకుండా దానిని తీసుకోవద్దు. ఆల్కహాల్‌తో పోలిస్తే రెడ్ వైన్‌లో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వైన్ ఎలా తయారవుతుంది?

రెడ్ వైన్ ద్రాక్ష నుండి తయారవుతుంది. దీని కోసం బ్లాక్‌, రెడ్‌ ద్రాక్షలను ఉపయోగిస్తారు. రిజిస్టర్డ్ వైన్ షాపులో అనేక రకాల వైన్ అందుబాటులో ఉంటుంది. అనేక రకాల వైన్లు ఉన్నాయి. రెడ్ వైన్‌తో పాటు వైట్ వైన్, రోజ్ వైన్ కూడా ఉన్నాయి. ఇందులో అన్నింటికన్న రెడ్ వైన్ ఉత్తమం అని ఇటాలియన్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన వివరాల ఆధారంగా, పరిశోధనల ఆధారంగా అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles