Skin Care Tips: వంటగదిలో ఉండే ఈ 3 వస్తువులతో మీ వీపు భాగాన్ని శుభ్రం చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ప్రతి ఒక్కరూ మృదువైన, అందమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. అయితే చర్మ సంరక్షణ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ..
ప్రతి ఒక్కరూ మృదువైన, అందమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. అయితే చర్మ సంరక్షణ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కేవలం ముఖానికి మాత్రమే పరిమితం అవుతారు. శీతాకాలంలో ప్రజలు ఎండలో ఎక్కువగా కూర్చోవడానికి ఇష్టపడతారు. దీని కారణంగా వారి చర్మం నలుపుగానూ, లేదా కాస్త జిడ్డుగా మారుతుంటుంది. ముఖ్యంగా మీ వెనుకభాగం అలా జరుగుతుంటుంది. అయితే ఇంట్లో లభించే వస్తువుల సహాయంతో మీరు సులభంగామీ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేసుకోవచ్చు. ఈ బ్యాక్ టానింగ్ రిమూవల్ మాస్క్‌ను తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం.
ఇందు కోసం పప్పు పిండి 4 నుండి 5 చెంచాలు, పెరుగు 1-2 చెంచాలు, రోజ్ వాటర్ సుమారు 3 టీస్పూన్లు తీసుకోవాలి.
ఎలా తయారు చేసుకోవాలి?
బ్యాక్ టానింగ్ రిమూవల్ మాస్క్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి. తర్వాత మీరు అందులో 4 నుండి 5 స్పూన్ల శెనగపిండి, 1 నుండి 2 స్పూన్ల పెరుగు జోడించండి. దీని తరువాత మీరు అందులో సుమారు 3 టీస్పూన్ల రోజ్ వాటర్ జోడించండి. తర్వాత ఈ పదార్థాలన్నీ బాగా కలపాలి.
ఎలా అప్లై చేయాలి?
బ్రష్ సహాయంతో మీ మెడ నుండి మీ వీపు వరకు బ్యాక్ టానింగ్ రిమూవల్ మాస్క్‌ని అప్లై చేయండి. అప్పుడు కనీసం 20 నిమిషాల పాటు ఈ మాస్క్‌ను అలాగే ఉంచండి. దీని తరువాత కాటన్, నీటి సహాయంతో పూర్తిగా శుభ్రం చేయండి. ఇలా మీరు కనీసం రెండు, నుంచి నాలుగు వారాల పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయుర్వేద నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి