Diabetes Diet: షుగర్ పేషెంట్స్‌ కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది.? ఏమైనా ప్రమాదమా.? పూర్తి వివరాలు..

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ వ్యాధితో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తీసుకునే ఆహారం, జీవన విధానంలో మార్పుల కారణంగా షుగర్‌ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక డయాబెటిస్‌ వ్యాధిగస్తులు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తినే ప్రతీ ఆహారాన్ని...

Diabetes Diet: షుగర్ పేషెంట్స్‌ కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది.? ఏమైనా ప్రమాదమా.? పూర్తి వివరాలు..
Diabetes Diet
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2022 | 1:27 PM

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ వ్యాధితో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తీసుకునే ఆహారం, జీవన విధానంలో మార్పుల కారణంగా షుగర్‌ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక డయాబెటిస్‌ వ్యాధిగస్తులు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తినే ప్రతీ ఆహారాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటారు. ఇలాంటి వాటిలో కొబ్బరి నీరు ఒకటి. సహజంగానే కొబ్బరి నీరు తియ్యగా ఉంటాయి. దీంతో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు.ఇంతకీ కొబ్బరి నీరు తాగితే నిజంగానే షుగర్‌ పెరుగుతుందా.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మధు మేహంతో బాధపడుతోన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైబర్ ప్రోటీన్స్‌, ఆకలిని తగ్గిస్తాయి. వీటిలోని నేచురల్ ఎలక్ట్రోలైట్స్‌ మధుమేహులకు ఇన్‌స్టాంట్‌ శక్తినిస్తాయి. పొటాషియం కూడా మేలు చేస్తుంది.

అయితే కొబ్బరి నీళ్లతో డయాబెటిస్‌ రోగులకు మేలు జరిగినా. ప్యాక్‌ చేసిన కొబ్బరి నీళ్లను మాత్రం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో షుగర్‌ స్తాయిలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇది షుగర్‌ పేషెంట్స్‌కు ఇబ్బందిగా మారుతుంది. ఇక డయాబెటిస్‌ ఎక్కువ ఉన్న వాళ్లు మాత్రం పరిమిత మేర కొబ్బరి నీటిని తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక అంశాల కోసం అందించినది మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు పాటించడం సూచించదగ్గ అంశం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..