Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం పై యునిసెఫ్ ప్రశంసలు.. ఆ విధానం అమలు దేశానికే ఆదమర్శమని కితాబు..

UNICEF India: మాతా, శిశు మరణాలు తగ్గించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడింది. సుర‌క్షిత..

Telangana: తెలంగాణ ప్రభుత్వం పై యునిసెఫ్ ప్రశంసలు.. ఆ విధానం అమలు దేశానికే ఆదమర్శమని కితాబు..
Unicef Praises Telangana For Being A Flag Bearer For Midwifery System
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 30, 2022 | 12:59 PM

UNICEF India: మాతా, శిశు మరణాలు తగ్గించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడింది. సుర‌క్షిత డెలివ‌రీల కోసం సిబ్బందికి మిడ్ వైఫ‌రీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరుపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ నేప‌థ్యంలో యునిసెఫ్ ఇండియా త‌న ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. ‘ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎ హెల్థీ స్టార్ట్’ హాష్ ట్యాగ్‌తో హైద‌రాబాద్‌లోని ఓ ఏరియా ఆసుపత్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు ఫోటోను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసింది. తెలంగాణ‌లో మాతాశిశు సంర‌క్షణ ఎంతో బాగుందని యునిసెఫ్ పేర్కొంది. మిడ్ వైఫ‌రీలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిన‌ట్లు ట్వీట్‌లో వెల్లడించింది. మెట‌ర్నిటీ కేర్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవప్రదమైన రీతిలో పనిచేస్తున్నట్లు తెలిపింది. పురుడు స‌మ‌యంలో త‌ల్లుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, పాజిటివ్ బ‌ర్త్ ఎక్స్‌పీరియ‌న్స్ క‌లిగే రీతిలో మిడ్‌వైవ్స్‌కు శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్రశంసించింది. తెలంగాణలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్‌వైవ్స్‌ శిక్షణ ఆలోచన అద్భుతంగా ఉందని ఇటీవ‌ల కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలశాఖ నర్సింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రతి బాలచంద్రన్ కూడా పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ శిక్షణను ఫెర్నాండేజ్‌ ఫౌండేషన్‌, యూనిసెఫ్‌ సాంకేతిక సహకారంతో పైలట్‌ ప్రాజెక్టుగా గజ్వేల్‌ ఏరియా ఆసుపత్రిలో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు ఆసుపత్రుల్లో నిర్వహిస్తోంది. గజ్వేల్‌ పట్టణంలోని ఏరియా హాస్పటల్‌లో తెలంగాణ ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా స్టాఫ్‌ నర్సులకు నిర్వహిస్తున్న మిడ్‌వైవ్స్‌ శిక్షణ విధానాన్ని ఆమె ఇటీవల పర్యవేక్షించారు. మిడ్ వైవ్స్ శిక్షణలో గర్భిణులు సాధారణ ప్రసవాలు జరుగడానికి తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, సాధారణ ప్రసవాల వల్ల లాభాలు, గర్భిణులకు సాధారణ ప్రసవాలపై విశ్వాసం కలిగేలా ఏవిధంగా చేయాలి అన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఈ విధానంపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..