Nampally Exhibition 2023: జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్.. టికెట్ ధర పెంపు.. ఎంతంటే..!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, అలాగే విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహిస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) జోరుగా కొనసాగనుంది..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, అలాగే విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహిస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) జోరుగా కొనసాగనుంది. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తారు. ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శన దేశ, విదేశాలలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ఇప్పటికే దాదాపు స్టాళ్ల కేటాయింపులు పూర్తి కావడంతో పలు స్టాళ్ల నిర్మాణానికి గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 46 రోజుల పాటు నుమాయిష్ సాగనుంది. ఈ సారి 82వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరగనుంది. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో నుమాయిష్‌లో 2400 స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉంటుంది.
టికెట్ ధర పెంపు:
ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి షాకిచ్చింది సొసైటీ. గతంలో 30 రూపాయలు ఉన్న టికెట్ ధర.. ఈ సారి 40 రూపాయలకు వరకు పెంచనున్నారు. ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలకు ఉచిత ప్రవేశం. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 వరకు నుమాయిష్ ఉంటుంది. అయితే గతంలో అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు సొసైటీ ప్రతినిధులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి