Medical Jobs: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. ఆరోగ్య శాఖలో ఖాళీల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు పోస్టుల భర్తీకి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్(టెలి మానస్) విభాగంలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్న...
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు పోస్టుల భర్తీకి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్(టెలి మానస్) విభాగంలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్న ఉద్యోగాల దరఖాస్తుకు గడువు నేటితో (30-12-2022) ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* సీనియర్ కన్సల్టెంట్ (01), కన్సల్టెంట్ (01), క్లినికల్ సైకాలజిస్ట్ (01), సైకియాట్రిక్ సోషల్ వర్కర్ (01), సైకియాట్రిక్ నర్సు (01), కౌన్సెలర్లు (20), టెక్నికల్ కోఆర్డినేటర్లు/ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్, ఎంఎస్సీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ఈమెయిల్ విధానంలో పంపించాలి.
* దరఖాస్తులను recruit.telemanasap@gamil.com ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 30-12-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..