HCL Recruitment 2023: పదో తరగతి/ఇంటర్ అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.45 వేల జీతం..
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో జనవరి 31, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్.. 54 మైనింగ్ మేట్, బ్లాస్టర్, డబ్ల్యూఈడీ ‘బి’, డబ్ల్యూఈడీ ‘సి’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పోస్టును బట్టి పదో తరగతి, ఇంర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. డిసెంబర్ 1, 2022వ తేదీనాటికి అభ్యర్ధుల వయసు 40 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జనవరి 31, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఇతర అభ్యర్ధులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. మైనింగ్ మేట్ పోస్టులకు రూ.18,480ల నుంచి రూ.45,400ల వరకు, బ్లాస్టర్‌కు, డబ్ల్యూఈడీ ‘బి’ పోస్టులకు రూ.18,180ల నుంచి రూ.37,310ల వరకు, డబ్ల్యూఈడీ ‘సి’ పోస్టులకు రూ.18,080ల నుంచి రూ.35,960ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.