AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTuber Amit Sharma: పాముకాటుకు గురైన ప్రముఖ యూట్యూబర్‌.. వీడియోలతో నెలకు 9 కోట్లకుపైనే ఆదాయం..

ప్రముఖ యూట్యూబర్‌ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. విషపూరితమైన పాముతో స్టంట్‌ చేస్తూ ఉండగా.. అది ఒక్కసారిగా యూట్యూబర్‌ వేలిని కొరికింది. దీంతో విషం అతని శరీరమంతా సోకి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వివరాల్లోకెళ్తే..

YouTuber Amit Sharma: పాముకాటుకు గురైన ప్రముఖ యూట్యూబర్‌.. వీడియోలతో నెలకు 9 కోట్లకుపైనే ఆదాయం..
Youtuber Amit Sharma
Srilakshmi C
|

Updated on: Dec 29, 2022 | 7:08 PM

Share

ప్రముఖ యూట్యూబర్‌ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. విషపూరితమైన పాముతో స్టంట్‌ చేస్తూ ఉండగా.. అది ఒక్కసారిగా యూట్యూబర్‌ వేలిని కొరికింది. దీంతో విషం అతని శరీరమంతా సోకి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వివరాల్లోకెళ్తే..

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని అల్వార్ నగరానికి చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ (24) రూర్కీలో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. సైన్స్‌కు సంబంధించిన ప్రయోగాలతో సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యాడు. అతనికి క్రేజీ ఎక్స్ వై జెడ్, ఇండియన్ అన్‌బాక్సర్ పేర్లతో రెండు యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. తనకున్న రెండు యూట్యూబ్‌ ఛానెళ్లలో 25 మిలియన్లకుపైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఐతే అమిత్ శర్మ తన ఆదాయం గురించి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో ప్రస్తావించనప్పటికీ.. అతను చేసే వీడియోల ద్వారా నెలకు 9 కోట్ల రూపాయలకుపైగా ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అమిత్ శర్మ తాజాగా పాముతో ఓ స్టంట్ చేస్తుండగా అది అతని వేలిని కాటు వేసింది. కరచిన పామును నాగుపాము అని సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఐతే అమిత్ శర్మ పాము కాటుకు గురయ్యాడనే విషయం గంటల వ్యవధిలోనే కోట్లాది మంది అభిమానులకు చేరింది. అతని ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.