Chai Samosa: ‘ఎట్టెట్టా..! టీ, సమోసా తిన్నందుకు రూ.490 బిల్లు వేశారా..?’ వైరల్‌ అవుతోన్న వీడియో

సాయంత్ర వేళ పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ.. సమోసా తింటూ, ఛాయ్‌ ఆస్వాదించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక టీ, సమోసా కాంబినేషన్‌కు ఎందరో అభిమానులు. అలాగే ధర కూడా రూ.50లకు మించి ఉండదు. ఐతే ఓ వ్యక్తికి..

Chai Samosa: 'ఎట్టెట్టా..! టీ, సమోసా తిన్నందుకు రూ.490 బిల్లు వేశారా..?' వైరల్‌ అవుతోన్న వీడియో
Chai Samosa Bill
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2022 | 5:00 PM

సాయంత్ర వేళ పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ.. సమోసా తింటూ, చాయ్‌ ఆస్వాదించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక టీ, సమోసా కాంబినేషన్‌కు ఎందరో అభిమానులు. అలాగే ధర కూడా రూ.50లకు మించి ఉండదు. ఐతే ఓ వ్యక్తికి భిన్నమైన అనుభవం ఎదురైంది. సమోసాలు, చాయ్‌ తిన్నందుకు ఏకంగా రూ.490 బిల్లు వేశారు. ఇదెక్కడో బయట దేశంలో జరిగిందనుకుంటే పొరబాటే.. ముంబాయ్‌ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటన ఇది. రెండు సమోసాలు, చాయ్‌, ఒక వాటర్‌ బాటిల్‌ కొన్నందుకు ఇచ్చిన బిల్లు చూసి ఘొల్లుమన్నాడట. ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్‌ దీనికి సంబంధించిన బిల్లును డిసెంబర్ 28న ట్విటర్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ బిల్లు నెట్టింట వైరల్ అవుతోంది.

కేవలం రెండు రోజుల వ్యవధిలో దాదాపు 1.3 మిలియన్‌ వీక్షణలతో, పది వేలకు పైగా లైకులతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ముంబై కందివాలి రైల్వే స్టేషన్‌లో రెండు సమోసాలు, ఒక చాయ్‌, వాటర్‌ బాటిల్‌ రూ.52లకే వస్తుందని ఓ యూజర్‌ కామెంట్‌ సెక్షన్‌లో రాసుకొచ్చాడు. అరె మేడాం..! హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఒక్కో ఇడ్లీ, వడ రూ.100లు, ఆరెంజ్‌ జ్యూస్‌ రూ.150లు.. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలంటూ మరొకరు, బెంగళూరు ఎయిర్ పోర్టులో రెండు సమోసాలు ఎంత అని అడిగితే రూ.250లు చెప్పారు. అంతే నోరుమూసుకుని వెళ్లిపోయానంటూ మరొకరు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను కామెంట్‌ సెక్షన్‌లో పంచుకున్నారు. ఏదిఏమైనా రూ.7 చాయ్‌ను ఫైవ్‌ స్టార్ హోటల్‌ రూ.150లకు, రూ.20 సమోసాను రూ.200లకు అమ్ముతున్న రోజుల్లో బతుకుతున్నాం. సంపాదించడానికి బతుకుతున్నారో లేక బతకడానికి సంపాదిస్తున్నారో తెలియని పరిస్థితులు ప్రస్తుతం నెలకొంటున్నాయి. మీరేం అంటారు.. ?

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.