Viral Video: కాసేపట్లో పెళ్లి.. మాజీ లవర్ దగ్గరికి వెళ్లిన వధువు.. విషయం తెలిసిన వరుడు ఏం చేశాడంటే..?

వివాహాలు అర్ధాంతరంగా ఆగిపోవడం చాలానే చూసుంటాం.. అందుకే పెళ్లి అయ్యే వరకు అవుతుందా..? లేదా..? అనే టెన్షన్.. ఒకవేళ అయితే భాగస్వాములిద్దరూ కలకాలం కలిసుంటారా..? అనే ప్రశ్న తరచూ పెద్దవారి నోట వినిపిస్తుంటుంది.

Viral Video: కాసేపట్లో పెళ్లి.. మాజీ లవర్ దగ్గరికి వెళ్లిన వధువు.. విషయం తెలిసిన వరుడు ఏం చేశాడంటే..?
Wedding
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 29, 2022 | 4:18 PM

వివాహాలు అర్ధాంతరంగా ఆగిపోవడం చాలానే చూసుంటాం.. అందుకే పెళ్లి అయ్యే వరకు అవుతుందా..? లేదా..? అనే టెన్షన్.. ఒకవేళ అయితే భాగస్వాములిద్దరూ కలకాలం కలిసుంటారా..? అనే ప్రశ్న తరచూ పెద్దవారి నోట వినిపిస్తుంటుంది. జంటల మధ్య మనస్పర్ధలతోనే లేక ఇతర కారణాలతోనో.. పెళ్లిపీటలపైనే తెగదెంపులు చేసుకోవడం కొత్తేమీ కాదు. పెళ్లి మరికాసేపట్లో జరుగుతుందనగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకున్న అనేక వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. తాజాగా ఘనాలోని కసోవాలో జరిగిన ఇలాంటి సంఘటన ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వివాహానికి ముందు.. వధువు తన మాజీ ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. ఇది తెలుసుకున్న వరుడు.. ఆమె పెళ్లే వద్దంటూ పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయాడు.

వివాహ వేడుకకు ముందు తన కాబోయే భార్య తన మాజీ ప్రియుడిని కలవడానికి వెళ్లిందని తెలుసుకున్న వరుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు డైలీ స్టార్ వెల్లడించింది. ఏంజెల్ ఎఫ్‌ఎమ్‌కి చెందిన వరుడు ఒపన్యిన్ డార్కో మాట్లాడుతూ పెళ్లి చేసుకోవడానికి ముందు తనకు కాబోయే భార్య తనను మోసం చేసిందని తెలుసుకుని.. వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపాడు.

అయితే.. ఈ విషయం తెలుసుకున్న వధువు.. వరుడు దగ్గరికి వచ్చి కాళ్లావేళ్లా పడి బతిమలాడింది.. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంది. ఏడుస్తూ వరుడి కాళ్లు సైతం పట్టుకుంది.. కానీ వరుడు మాత్రం అస్సలు పట్టించుకోలేదు.. పెళ్లి పెట్టుకుని మాజీ లవర్ ను కలిసేందుకు ఎలా వెళ్లావంటూ ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరో అవకాశం ఇవ్వాలంటూ వధువు ఏడుస్తూ.. వరుడిని వేడుకుంటున్న దృశ్యాలను వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కొన్ని కథనాల ప్రకారం, వధువు స్నేహితులలో ఒకరు ఆమె చేసిన పనిని.. వరుడికి తెలియజేయడంతో.. పెళ్లి నాటకీయంగా మారి తెగదెంపుల వరకూ వెళ్లింది. ఈ షాకింగ్ ఘటనపై నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..