క్యాసినో హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 19 మంది సజీవదహనం.. ప్రాణభయంతో ఐదో అంతస్తు నుంచి కిందికి దూకేశారు..

థాయిలాండ్‌ సరిహద్దులో పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ క్యాసినోలో బుధవారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు..

క్యాసినో హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 19 మంది సజీవదహనం.. ప్రాణభయంతో ఐదో అంతస్తు నుంచి కిందికి దూకేశారు..
Cambodia Hotel Casino Fire Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2022 | 6:47 PM

థాయిలాండ్‌ సరిహద్దులో పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ క్యాసినోలో బుధవారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అనేక మంది తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కంబోడియా పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో హోటల్‌లో 400లకు పైగా మంది ఉన్నారు. బుధవారం రాత్రి 11 గంటల 30 నిముషాలకు ప్రమాదం చోటుచేసుకోగా.. థాయ్ రెస్క్యూ టీం తెల్లవారుజామున 7 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుంది. మొత్తం 360 మంది అత్యవసర సిబ్బంది, 11 ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టాయి. ఇంకా సహాయ చర్యలు చేపడుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ప్రమాదం సంభవించినప్పుడు దట్టమైన పొగ పరిసరప్రాంతాలను కమ్మేసింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో హోటల్‌లో చిక్కుకున్న వారు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడంతో భయానక పరిస్థితులు నొలకొన్నాయి. కొందరు ప్రాణాలను కాపాడుకోవడానికి హోటల్‌ నుంచి బయటికి దూకడంతో తీవ్రగాయాల పాలయ్యారు. ప్రస్తుతం థాయ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 79 మంది థాయ్‌ దేశీయులు, 30 మంది కంబోడియన్లు, ఎనిమిది మంది ఇండోనేషియన్లు చికిత్స పొందుతున్నట్లు థాయ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు మీడియాకు తెలిపాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

కాగా ఆగ్నేయాసియాలోని అత్యంత పేద దేశాలలో కంబోడియా ఒకటి. ఐతే ఆ దేశ పౌరులు కాసినో ఆడటాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. థాయ్ సరిహద్దులో అనేక హోటళ్లలో కాసినోలు విచ్చలవిడిగా అడుతుంటారు. ప్రస్తుతం అగ్నిప్రమాదం సంభవించిన పోయిపెట్ హోటల్‌లో సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ఇక ఈ ఏడాది థాయ్‌లాండ్, వియత్నాంలలోని వినోద వేదికలలో మరో రెండు ఘోర అగ్నిప్రమాదాలు జరిగాయి. థాయ్ నైట్‌క్లబ్‌లో ఆగస్ట్‌ నెలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 మంది మృతి చెందగా అనేకమంది గాయపడ్డారు. మరుసటి నెలలో దక్షిణ వియత్నాంలో ఒక కరోకే బార్‌లో మంటలు చెలరేగడంతో 32 మంది మరణించారు. నిబంధనలకు వ్యతిరేకంగా థాయ్‌ సరిహద్దులో లెక్కలేనన్ని బార్‌లు, నైట్‌క్లబ్‌లు నిర్వహించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.