Spelling Mistake: స్పెల్లింగ్ తప్పుగా చెప్పిందని ఐదేళ్ల చిన్నారి చేయి విరిచిన టీచర్.. ఎక్కడ జరిగిందంటే..
చదువు నేర్పాలంటే ఉపాధ్యాయులు అడపాదడపా పిల్లలపై చేయి చేసుకోవడం పరిపాటే. ఐతే ఓ టీచర్ మాత్రం స్పెల్లింగ్ తప్పు చెప్పిందని ఐదేళ్ల చిన్నారి చెయ్యి విరిచేశాడు. స్థానికంగా కలకలంరేపిన..
చదువు నేర్పాలంటే ఉపాధ్యాయులు అడపాదడపా పిల్లలపై చేయి చేసుకోవడం పరిపాటే. ఐతే ఓ టీచర్ మాత్రం స్పెల్లింగ్ తప్పు చెప్పిందని ఐదేళ్ల చిన్నారి చెయ్యి విరిచేశాడు. స్థానికంగా కలకలంరేపిన ఈ సంఘటన మంగళవారం (డిసెంబర్ 27) నాడు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. (Parrot) స్పెల్లింగ్ తప్పుగా చెప్పిందని ట్యూషన్ టీచర్ ప్రయాగ్ విశ్వకర్మ (22) ఐదేళ్ల చిన్నారి కుడి చేయి విరిగేటట్టు కొట్టాడు. చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటీన ఆసుపత్రికి తలించగా చెయ్యి విరిగినట్లు తెలిపారు.
ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ మనీష్ రాజ్ సింగ్ భదౌరియా మీడియాకు వెల్లడించారు. ఓ స్కూల్లో నిర్వహించనున్న అడ్మిషన్ టెస్ట్‌కు సిద్ధం చేసేందుకు చిన్నారి తల్లిదండ్రులు తమ ఇంటికి సమీపంలో నివసించే ట్యూటర్‌ను నియమించుకున్నారు. ఈ క్రమంలో చిన్నారి స్పెల్లింగ్ తప్పు చెప్పడంతో కోపోధ్రిక్తుడైన టీచర్ చిన్నారిని కొట్టడంతో చేయి విరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైం సమాచారం కోసం క్లిక్ చేయండి.