AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Alert: భారత్‌లో కరోనా అలెర్ట్.. చైనా సహా ఆ దేశాల నుంచి వచ్చే వారికి ఆ రిపోర్ట్ ఉండాల్సిందే.. లేకుంటే..

చైనా సహా పలు దేశాల్లో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. భారీగా పెరుగుతున్న కోవిడ్-19 వేరియంట్ కేసులు, మరణాలతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనావైరస్ BF.7 వేరియంట్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది.

Corona Alert: భారత్‌లో కరోనా అలెర్ట్.. చైనా సహా ఆ దేశాల నుంచి వచ్చే వారికి ఆ రిపోర్ట్ ఉండాల్సిందే.. లేకుంటే..
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: Dec 29, 2022 | 5:56 PM

Share

చైనా సహా పలు దేశాల్లో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. భారీగా పెరుగుతున్న కోవిడ్-19 వేరియంట్ కేసులు, మరణాలతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనావైరస్ BF.7 వేరియంట్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది. కరోనా నిబంధనలు పాటించాలని.. మాస్క్, భౌతిక దూరం తప్పనిసరని పేర్కొంది. అంతేకాకుండా కరోనా ఫోర్త్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ సైతం నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం వెల్లడించారు. జనవరి 1, 2023 నుంచి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణీకులకు RT-PCR పరీక్షను తప్పనిసరి చేసినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.

ప్రయాణానికి ముందు వారు తమ ఆర్టీపీసీఆర్ కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా ఈ పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని తెలిపారు. అయితే ఇప్పటికే ఎయిర్‌పోర్టుల్లో అమల్లో ఉన్న 2శాతం మందికి రాండమ్ పరీక్షల నిబంధనలకు ఇది అదనమని పేర్కొన్నారు. అంతకుముందు, కోవిడ్ కేసులు పెరిగిన తరువాత అంతర్జాతీయ ప్రయాణికులలో రెండు శాతం మంది కోవిడ్ పాజిటివ్ గా పరీక్షించడంతో ప్రభుత్వం కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ను తప్పనిసరి చేసింది. రాండమ్ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించడంతోపాటు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

ఇక, దేశంలో ప్రస్తుతం కరోనా (Corona Virus) వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.11శాతంగా ఉంది. అయినప్పటికీ వచ్చే 40 రోజులు కీలకమని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. అయితే దేశంలో మరో కొవిడ్ వేవ్‌ వచ్చినప్పటికీ.. ఈ సారి వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

40 రోజులు కీలకం..

కాగా.. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.11శాతంగా ఉంది. జనవరిలో దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమని ప్రభుత్వం హెచ్చరించింది. గతంలో, తూర్పు ఆసియాలో కోవిడ్-19 కేసులు పెరిగిన 30-35 రోజుల తర్వాత మహమ్మారి ప్రమాదం భారతదేశంలోకి ప్రవేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిలో భాగంగా వచ్చే 40 రోజులు కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..