Telangana Jobs: ఇక ప్రతీయేట ఇంటర్‌ స్థాయిలోనే రాష్ట్ర విద్యార్ధులకు 20 వేల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. మంత్రి సబితా

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతీ సంవత్సరం 20 వేల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు..

Telangana Jobs: ఇక ప్రతీయేట ఇంటర్‌ స్థాయిలోనే రాష్ట్ర విద్యార్ధులకు 20 వేల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. మంత్రి సబితా
Sabitha Indra Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2022 | 8:31 PM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతీ సంవత్సరం 20 వేల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన కుదిరిందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇంచార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో తన కార్యాలయంలో సమీక్షించారు.

గణితం సబ్జెక్టు కలిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి మాసంలో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో కనీసం 60 శాతం మార్కులు పొందిన విద్యార్థులకు వర్చువల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి విద్యార్థులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్ లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని అన్నారు. ఈ శిక్షణ పూర్తి అయినవారికి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించి ప్రతీ నెలా 10 వేల రూపాయలను స్టైఫండ్ గా అందిస్తారని తెలిపారు.

ఈ ఇంటర్న్‌షిప్‌ పూర్తి కాగానే 2 .5 లక్షల వార్షిక వేతనంపై పూర్తి స్థాయిలో అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. వీరికి ఉద్యోగం చేస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారని అన్నారు. వీరి అనుభవం పెరుగుతున్న కొద్దీ ఏటేటా వేతనాన్ని పెంచుతారని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పేద విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం అని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.