- Telugu News Photo Gallery Cinema photos Tunisha Sharma's suicide case: Is Tunisha Sharma death related to 'love jihad'?
Tunisha Sharma’s suicide case: తునీషా శర్మ ఆత్మహత్యను ‘లవ్ జీహాద్’ అని ఎందుకు అంటున్నారో తెలుసా..
ప్రముఖ నటి తునీషా శర్మ శనివారం షూటింగ్ సెట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత ఆమెది ఆత్మహత్య అనుకున్నారంతా.. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రలు తునీషా శర్మ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె సహనటుడు..
Updated on: Dec 29, 2022 | 8:02 PM

ప్రముఖ నటి తునీషా శర్మ శనివారం షూటింగ్ సెట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత ఆమెది ఆత్మహత్య అనుకున్నారంతా.. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రలు తునీషా శర్మ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె సహనటుడు షీజన్ ఖాన్ తమ కూతురిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడాని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్‌తో సహా అనేక మంది రాజకీయ నాయకులు ఆమె మృతిని ‘లవ్ జిహాద్’గా అభివర్ణిస్తున్నారు.

‘చక్రవర్తి అశోక్ సామ్రాట్’, ‘ఇష్క్ సుభాన్ అల్లా’, ‘ఇంటర్నెట్ వాలా లవ్’ వంటి సీరియళ్ల ద్వారా తునీషా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తునీషా, షీజన్ ఖాన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 15 రోజుల క్రితమే వారికి బ్రేకప్ అయింది. తునీషాను వివాహం చేసుకుంటానని షీజన్ ఖాన్ నమ్మించి మోసం చేశాడని, తునీషా కంటే ముందే మరో అమ్మాయితో షీజన్ ఖాన్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడు, నాలుగు నెలలు తునీషాను వాడుకుని, అడ్డుతొలగించుకున్నాడని ఆమె తల్లి వనితా శర్మ అంటున్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణలో లవ్ జిహాద్ కోణం ఏదీ కనిపించలేదని తునీషా కేసును విచారిస్తోన్న ఏసీపీ చంద్రకాంత్ జాధవ్ తెలిపారు.

పోస్ట్ మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. బ్రేకప్ కారణంగా తునీషా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు ఆయన అన్నారు.





























