Sports Quota for TS jobs: క్రీడా కోటా కింద వారికీ రిజర్వేషన్‌ వర్తింపజేయండి..: తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీలో స్పోర్ట్స్‌ కోటా కింద దివ్యాంగ క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్‌లో కల్పించే విషయాన్ని పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం (డిసెంబర్‌ 29) హైకోర్టు..

Sports Quota for TS jobs: క్రీడా కోటా కింద వారికీ రిజర్వేషన్‌ వర్తింపజేయండి..: తెలంగాణ హైకోర్టు
Telangana High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2022 | 8:55 PM

తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీలో స్పోర్ట్స్‌ కోటా కింద దివ్యాంగ క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్‌లో కల్పించే విషయాన్ని పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం (డిసెంబర్‌ 29) హైకోర్టు సూచించింది. జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టుల నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా కింద 2 శాతం రిజర్వేషన్‌ను పారా స్పోర్ట్స్‌కు వర్తింపజేయకుండా పంచాయతీరాజ్‌శాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ రాగుల నరేశ్‌ యాదవ్‌తోపాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

దీనిపై ఈ రోజు విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం పిటిషనర్ల అభ్యర్థనను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.