AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breathing Exercise: చలికాలంలో శ్వాస మీద ధ్యాస పెడితే అద్భుత ఫలితాలు..వర్క్ అవుట్స్ కంటే సూపర్ రిజల్ట్స్..

నార్మల్ బ్రీత్ ఎక్సర్ సైజ్ చేస్తే అసాధారణ ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మనకు కుదిరిన టైమ్ లోనే ఐదు నిమిషాలపాటు బ్రీత్ ఎక్సర్ సైజ్ చేస్తే మంచిదంటున్నారు. జస్ట్ రిలాక్స్ గా కూర్చొని ప్రశాంతమైన మనస్సుతో శ్వాసపై ధ్యాస ఉంచి ఎక్సర్ సైజ్ చేయాలి.

Breathing Exercise: చలికాలంలో శ్వాస మీద ధ్యాస పెడితే అద్భుత ఫలితాలు..వర్క్ అవుట్స్ కంటే సూపర్ రిజల్ట్స్..
File Pic
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 30, 2022 | 4:36 PM

Share

చలికాలం వచ్చిందంటే తరచూ వ్యాయామం చేసే వాళ్లు బద్ధకిస్తుంటారు. అటు వాకింగ్ కు వెళ్లకపోడంతో సరైనా డైట్ ప్లాన్ కూడా అమలు చేయరు. కానీ మనస్సులో మాత్రం ఏమైనా ఇబ్బందులు వస్తాయోమోనని భయపడుతుంటారు. అయితే ఈ సమయంలో నార్మల్ బ్రీత్ ఎక్సర్ సైజ్ చేస్తే అసాధారణ ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మనకు కుదిరిన టైమ్ లోనే ఐదు నిమిషాలపాటు బ్రీత్ ఎక్సర్ సైజ్ చేస్తే మంచిదంటున్నారు. జస్ట్ రిలాక్స్ గా కూర్చొని ప్రశాంతమైన మనస్సుతో శ్వాసపై ధ్యాస ఉంచి ఎక్సర్ సైజ్ చేయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం చాలా సులభమని పేర్కొంటున్నారు. శ్వాస వ్యాయామం వల్ల కలిగే అదిరిపోయే ఫలితాలేంటో ఓసారి తెలుసుకుందాం. 

శరీరానికి మెరుగైన ఆక్సిజన్ 

ఆక్సిజన్ తగినంతగా తీసుకోకపోవడం వల్ల శరీరంలో  కార్బన్ డయాక్సైడ్‌ని ఎక్కువసేపు ఉండడంతో విషంలా పని చేస్తుంది. దీంతో మనకు అలసట, మగత, తేలికగా, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది మన అన్ని అవయవాల సాధారణ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఆక్సిజన్ మన ఊపిరితిత్తులను సరైన మార్గంలో పని చేస్తుంది. వీటి విషయంలో రాజీ పడితే శ్వాసకోశ రుగ్మత కారణంగా వాటి పనితీరుపై ప్రభావం పడుతుంది. 

మెరుగైన రక్త ప్రసరణ

శ్వాస కోశ ఎక్సర్ సైజ్ లు చేయడం వల్ల మెరుగ్గా రక్త ప్రసరణ ఉంటుంది. ఎక్సర్ సైజ్ చేసే సమయంలో గాలీ తీసుకునే వదిలే సమయంలో రక్త ప్రసరణ మరింత మెరుగ్గా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

ఒత్తిడి, ఆందోళన దూరం

శ్వాస వ్యాయామాలు చేస్తే శరీరం ఆక్సిజన్ తీసుకునే స్థాయి పెరుగుతుంది. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆక్సిజన్ స్థాయి ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు బాగా పని చేస్తుందని నిపుణుల వాదన.

గుండె పని తీరు మెరుగు

క్రమం తప్పకుండా రోజూ బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు చేస్తే రక్తపోటు స్థాయి మెయిన్ టెయిన్ అవుతుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఇతర గుండె వ్యాధులు దరి చేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాంతివంతమైన చర్మం

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ ల వల్ల పెరిగే ఆక్సిజన్ కారణంగా చర్మం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. బ్లడ్ థ్రష్ పెరగడంతో చర్మం రూపం మరింత మెరుగ్గా కనిపిస్తుంది. అలాగే రక్తాన్ని డీటాక్షిఫికేషన్ చేయడంతో చర్మం మరింత యవ్వనంగా, మెరుస్తూ కనిపిస్తుంది. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..