Skin Cancer: ఎండలో అధికంగా తిరుగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! మహమ్మారి పొంచి ఉంది..
విపరీతంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తో అధికమవుతున్న ఉష్ణోగ్రతలేనని నిపుణులు చెబుతున్నారు. జనాలు నివసించే దేశాలు, అక్కడి వాతావరణ పరిస్థతుల బట్టి స్కిన్ క్యాన్సర్ ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు.
క్యాన్సర్.. ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రధానంగా స్కిన్ క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. దీనికి ప్రధాన కారణం విపరీతంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తో అధికమవుతున్న ఉష్ణోగ్రతలేనని నిపుణులు చెబుతున్నారు. జనాలు నివసించే దేశాలు, అక్కడి వాతావరణ పరిస్థతుల బట్టి స్కిన్ క్యాన్సర్ ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా యూరోప్ లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా దేశంలో ఈ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ స్కిన్ క్యాన్సర్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ప్రధానంగా రెండు రకాల స్కిన్ క్యాన్సర్ లు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. అవి నాన్ మెలనోమా స్కిన్ క్యాన్సర్, మెలనోమా స్కిన్ క్యాన్సర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం 2040 నాటికి ప్రపంచ వ్యాప్తంగా దీని బారిన పడే వారి సంఖ్య అధికమయ్యే అవకాశం ఉంది.
వేడి వాతావరణమే కారణమా..
వాస్తవానికి స్కిన్ క్యాన్సర్ కు ప్రధాన కారణం ఇది అని చెప్పడానికి వీలు పడదు. కానీ చాలా మంది పరిశోధకులు మాత్రం గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొంత వరకూ స్కిన్ క్యాన్సర్ ప్రబలడానికి కారణమని పేర్కొంటున్నారు. 2021 అక్టోబర్ లో లాన్సెట్ సైన్స్ జర్నల్ లో వాతావరణ మార్పుల కారణంగా అల్ట్రా వయోలెట్ రేడియషన్ పెరుగుతోందని , ఇది స్కిన్ క్యాన్సర్ కు కారణమవుతోందని నిపుణులు పేర్కొన్నారు.
చర్మం రంగును బట్టి కూడా..
లేత రంగులో చర్మం ఉండే వారిలో ఈ స్కిన్ క్యాన్సర్ అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాలతో పాటు పలు యూరోపియన్ దేశాలు దీని బారిన అధికంగా పడుతున్నట్లు వివరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదక ప్రకారం నలుపు, బ్రోన్ రంగులో ఉండే మనుష్యులు కాస్త ఎండ వేడిని తట్టుకోగలగుతారు. ఇది స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. అందుకే ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఈ స్కిన్ క్యాన్సర్ ప్రభావం తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. కానీ కొన్ని లెక్కల ప్రకారం ఆఫ్రికా దేశాల్లో కూడా 2040 నాటికి 96 శాతం ఈ క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అలాగే ఆసియా దేశాల్లో కూడా 2040 నాటికి 59 శాతం, నాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో 67 శాతం మేర స్కిన్ క్యాన్సర్ రోగులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఎలా గుర్తించాలి..
యూఎస్ కు చెందిన పరిశోధకులు మెలనోమా రకం స్కిన్ క్యాన్సర్ ను గుర్తించడానికి సింపుల్ టెక్నిక్ సూచిస్తున్నారు. ఏ,బీ,సీ,డీ,ఈ పేరిట కొన్ని లక్షణాలను వివరిస్తున్నారు. Asymmetrical: ఏదైనా పుట్టు మచ్చ, లేదా మచ్చ విచిత్ర ఆకృతిలో ఉండి చూడటానికి ప్రత్యేకంగా ఉందా? Border: ఆ మచ్చ చుట్టూ ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? Color: చర్మంపై కనిపించిన మచ్చ రంగు వేరే కలర్ ఉందా? Diameter: పుట్టుమచ్చ లేదా మచ్చ బఠానీ పరిమాణం కంటే పెద్దదా? Evolving: ఆ మచ్చ పరిమాణం మారుతూ ఉందా? అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఇవన్నీ స్కిన్ క్యాన్సర్ ప్రారంభ దశ లక్షణాలుగా గుర్తించి వైద్యులను సంప్రదించాలి.
ఎలా సంరక్షించుకోవాలి..
సూర్యరశ్మి శరీరంపై పడేటట్లుగా బయట ఎక్కువ తిరగకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా తగిన విధంగా దుస్తులు ధరించాలి. మంచి సన్ స్క్రీమ్ వాడాలి. ఎండ ముఖంతో పాటు తల, మెడ, చెవులపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అవకాశం ఉంటే సన్ గ్లాసెస్ వినియోగించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..