AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో ప్రమాదకర రోగాలు.. కరగాలంటే వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే

పొట్టచుట్టూ అదనపు కొవ్వు తగ్గించడంలో పుదీనా సమర్థంగా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజూ 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా  తగ్గుతుంది

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో ప్రమాదకర రోగాలు.. కరగాలంటే వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే
Belly Fat Burning
Basha Shek
|

Updated on: Dec 30, 2022 | 6:08 PM

Share

పొట్టలో కొవ్వును తగ్గించుకుని స్లిమ్‌గా కనిపించాలని చాలామంది అనుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే పొట్టలోని అదనపు కొవ్వు తగ్గించడంలో పుదీనా సమర్థంగా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజూ 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా  తగ్గుతుంది. శరీరంలోని కొవ్వులో ఎక్కువ భాగం పొత్తికడుపు ప్రాంతంలో నిల్వ ఉంటుంది. విసెరల్ ఫ్యాట్ అని పిలువబడే ఈ రకమైన కొవ్వు మధుమేహం, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కలిగిస్తుంది. దీనికి తోడు చలికాలంలో చాలామంది బద్ధకంగా ఉంటారు. వ్యాయామానికి దూరంగా ఉంటారు. అలాగే కొన్ని ఆహారాలు కూడా బరువు పెరగడానికి దారితీస్తాయి. ఈ క్రమంలో చలికాలంలో పొట్ట కొవ్వును తగ్గించుకోవడం కష్టం. అయితే ఇందుకోసం ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి చిట్కాలు:

గోరు వెచ్చని నీరు

గోరువెచ్చని నీరు తాగడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇది జీవక్రియను పెంచుతుంది. మీకు అవసరమైనప్పుడు రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. ఎందుకంటే ఇది పొట్ట నుండి మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాల నుండి కూడా కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

యోగా

కొవ్వును తగ్గించుకోవడానికి యోగా ఒక సులభమైన మార్గం. మీరు యోగా, 12 సూర్య నమస్కార్లు మరియు కపాలభాతి ప్రాణాయామం చేస్తారు, ఇది రక్త ప్రసరణ, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మెంతి నీరు

ఆయుర్వేద నిపుణుల ప్రకారం మెంతులు వేయించి పొడి చేసి పచ్చిగా లేదా నీళ్లలో కలిపి తీసుకోవచ్చు. ఈ పానీయం ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. లేదా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం తినవచ్చు.

అల్లం

మీరు పొడి అల్లం తీసుకోవడం వల్ల, ఇది జీవక్రియను పెంచుతుంది. అలాగే ఎండు అల్లం పొడిని వేడి నీటిలో కలిపి తాగితే కొవ్వు కరిగిపోతుంది.

నడక

ఇక ప్రతిరోజూ 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోవడానికి ఇది సులభమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..