Nithya Menon: మరోసారి సింప్లిసిటీని చాటుకున్న నిత్యా మీనన్‌.. గిరిజన బిడ్డలను ఎత్తుకుని లాలిస్తూ.. ఫొటోలు వైరల్‌

తాజాగా సింప్లిసిటీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది నిత్య. తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆమె వరదయ్యపాళెంలోని కల్కి ట్రస్టుకు చెందిన ఏకం దేవాలయాన్ని సందర్శించింది.

Nithya Menon: మరోసారి సింప్లిసిటీని చాటుకున్న నిత్యా మీనన్‌.. గిరిజన బిడ్డలను ఎత్తుకుని లాలిస్తూ.. ఫొటోలు వైరల్‌
Nithya Menen
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2022 | 2:12 PM

ఇటీవల సినిమాల కంటే ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది ప్రముఖ హీరోయిన్‌ నిత్యామీనన్‌. కాలికి కట్టుకోవడం మొదలు ప్రెగ్నెన్సీ కిట్‌తో పాటు బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ చేసి ఫ్యా్న్స్‌కు షాకిచ్చింది ముద్దుగుమ్మ. అయితే ఇవన్నీ ఆమె నటించిన ది వండర్ ఉమెన్ సినిమా ప్రమోషన్లలో భాగంగానే చేసిందని తెలిసింది. ఆతర్వాత పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది నిత్యా. ఇదిలా ఉంటే తాజాగా సింప్లిసిటీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది నిత్య. తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆమె వరదయ్యపాళెంలోని కల్కి ట్రస్టుకు చెందిన ఏకం దేవాలయాన్ని సందర్శించింది. అనంతరం సమీపంలోని కాంబాకం గిరిజనకాలనీలో పర్యటించారు. అక్కడి స్థానికులు, గిరిజన విద్యార్థులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ గిరిజన బిడ్డని ఎత్తుకొని ఆడించింది. పల్లెటూరి పాటలతో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నిత్య సింప్లిసిటీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా నిత్య వారం రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది భీమ్లానాయక్‌, తిరు, వండర్‌ వుమెన్‌ సినిమాలతో సందడి చేసింది నిత్య. ఇందులో భీమ్లానాయక్‌, తిరు సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న ఐరన్‌ లేడీలో నిత్య టైటిల్‌ రోల్‌ను పోషించనుంది. అలాగే కొన్ని తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..