Tollywood: ఇయర్ ఎండ్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఎన్టీఆర్ టూ మహేష్ బాబు ఎక్కడెక్కడున్నారో తెలుసా..
మన తెలుగు హీరోస్ ఈ సంవత్సరం ఎండింగ్.. వచ్చే ఏడాదికి స్వాగతం పలికేందుకు ఫ్యామిలీస్ తో కలిసి తమకు నచ్చిన ప్రదేశాల్లో వాలిపోయారు.. ఇంతకీ ఎవరెవరు ఎక్కడున్నారో తెలుసుకుందామా.

ఈ ఏడాది పూర్తికావొస్తుంది. 2022కు బై బై చెప్పి 2023కు వెల్ కమ్ చెప్పేందుకు ప్రపంచం సిద్ధమయ్యింది. ఇక మరోవైపు ఇయర్ ఎండింగ్ ప్లాన్స్ సామాన్యులే కాదు.. సెలబ్రెటీస్ సైతం షూరు చేశారు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరోస్ ఈ సంవత్సరం ఎండింగ్.. వచ్చే ఏడాదికి స్వాగతం పలికేందుకు ఫ్యామిలీస్ తో కలిసి తమకు నచ్చిన ప్రదేశాల్లో వాలిపోయారు.. ఇంతకీ ఎవరెవరు ఎక్కడున్నారో తెలుసుకుందామా.
యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈఏడాది ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి అమెరికాలో సందడి చేస్తున్నారు. అక్కడి నుంచే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు.




View this post on Instagram
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే బన్నీ తన ఫ్యామిలీతో కలిసి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఇటీవల నెట్టింట్లో పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తే అర్థమవుతుంది.

Allu Arjun
View this post on Instagram
ఇక.. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ కలిసి స్విట్జర్లాండ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి మహేష్ సతీమణి నమ్రత ఫోటోస్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి వీరు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇక రామ్ చరణ్.. ఉపాసన దంపతులు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




