Trisha Krishnan: అజిత్- విజయ్ ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్..? త్రిష సమాధానం ఏంటంటే
ఇటీవల దిల్ రాజు మాట్లాడుతూ.. అజిత్ కంటే విజయ్ నెంబర్ వన్ హీరో అని అన్నారు. అంతే అజిత్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యల పై భగ్గుమన్నారు. అటు విజయ్ ఫ్యాన్స్ కూడా తక్కువ కాదు అంటూ ఫైర్ అయ్యారు.
తమిళ నాట దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో మంటలు రేపుతున్నాయో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల్లో ఎవరు నెంబర్ వన్ అనే చర్చకు దారితీశాయి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు. ఇటీవల దిల్ రాజు మాట్లాడుతూ.. అజిత్ కంటే విజయ్ నెంబర్ వన్ హీరో అని అన్నారు. అంతే అజిత్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యల పై భగ్గుమన్నారు. అటు విజయ్ ఫ్యాన్స్ కూడా మేమేమి తక్కువ కాదు అంటూ ఫైర్ అయ్యారు. ఇక దిల్ రాజు నిర్మించిన వారీసు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది. అనే క్రమంలో అజిత్ నటించిన తనీవు సినిమా కూడా రిలీజ్ చేయనున్నారు. దాంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. ఈ క్రమంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవి కాస్త ఇప్పుడు ఎక్కువయ్యాయి.
ఇక ఇదే విషయం పై హీరోయిన్ త్రిష స్పందించింది. తాజాగా త్రిష నటించిన రాంగి అనే సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వివిధ ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది త్రిష. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో త్రిష పాల్గొనగా యాంకర్ అజిత్, విజయ్ ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అనే విషయం పై వివాదం జరుగుతోంది తెలుసా అని ప్రశ్నించారు. దానికి త్రిష..
‘ఇద్దరూ చాలా పెద్ద నాటులు.. చాలా అనుభవం ఉన్న నటులు. ఇద్దరికీ స్టార్ స్టేటస్ ఉంది. వారిలో ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పడం చాలా కష్టం’ అని తెలిపింది. అలాగే నాకు ఈ నెంబర్ గేమ్ పై పెద్దగా నమ్మకం లేదు. మనం నటించిన లాస్ట్ సినిమా హిట్ అయితే మనమే నెంబర్ వన్.. లేకపోతే ఆ ప్లేస్ లోకి ఇంకొకరు వస్తారు అని చెప్పుకొచ్చింది త్రిష.