AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leena Nagwanshi: మరో విషాదం..ఆత్మహత్యకు పాల్పడిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.. కారణమేంటంటే?

లీనా నాగవంశి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఛతీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో సూసైడ్‌ చేసుకుంది. తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.

Leena Nagwanshi: మరో విషాదం..ఆత్మహత్యకు పాల్పడిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.. కారణమేంటంటే?
Leena Nagwanshi
Basha Shek
|

Updated on: Dec 28, 2022 | 1:49 PM

Share

బాలీవుడ్‌ బుల్లితెర నటి తునీషా శర్మ ఆత్మహత్య దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. 21 ఏళ్లకే ఆమె బలవన్మరణానికి పాల్పడడం అందరినీ షాక్‌కు గురి చేసింది. దీనిని మరవకముందే మరో బలవన్మరణం చోటు చేసుకుంది. లీనా నాగవంశి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఛతీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో సూసైడ్‌ చేసుకుంది. తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. చక్రధర్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంగేశ్వర్ యాదవ్ తెలిపిన వివ‌రాల మేర‌కు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌గ‌ఢ్ జిల్లాకు చెందిన లీనా నాగ‌వంశీ బీకామ్ రెండో సంవత్సరం చ‌దువుతోంది. ఆమె చదువుకునేందుకు ఇంటి టెర్రస్‌పైకి వెళ్లింది. అర‌గంట త‌రువాత ఆమె త‌ల్లి పైకి వెళ్లి చూడ‌గా చున్నీతో ఉరివేసుకుని వేలాతుతూ ఉండ‌డాన్ని గుర్తించింది. వెంట‌నే ఆమె కేక‌లు వేసింది. స్థానికులు అక్కడకు చేరుకుని లీనాను కింద‌కు దింపి ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందిన‌ట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

కాగా కుటుంబంలో లీనా నాగవంశీ చిన్న కుమార్తె. ఆమె సోష‌ల్ మీడియాల‌లో యాక్టివ్‌గా ఉండేది. టిక్‌టాక్‌లో వీడియోలు చేసేది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 10,000 మందికి పైగా ఫాలోవర్లను ఉన్నారు. ఇది కాకుండా, ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. ఆమె ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఆమె ఫోటోషూట్‌లతో నిండి ఉన్నాయి. అలాగే వివిధ వార్డ్‌రోబ్‌లలో పోజులిచ్చిన ఫొటోలు కూడా ఉన్నాయి. కాగా స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆమె దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భ్యం కాలేద‌ని చెప్పారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా లీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!