Dhamaka: వసూల్ రాజా.. ధమాకా మూవీకి ఐదురోజుల్లోనే అదిరిపోయే కలెక్షన్స్

పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం(డిసెంబర్ 23న) విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా.

Dhamaka: వసూల్ రాజా.. ధమాకా మూవీకి ఐదురోజుల్లోనే అదిరిపోయే కలెక్షన్స్
Raviteja
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 28, 2022 | 3:10 PM

మాస్ మహా రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. చాలా రోజుల తర్వాత ఈ మూవీతో హిట్ అందుకున్నాడు రవితేజ. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం(డిసెంబర్ 23న) విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమాకు మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చేసింది.

ఇక ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. . వీకెండ్ ను సూపర్ గా క్యాష్ చేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు భారీగానే వసూల్ చేశారు. నిన్నటికి 20కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసిందని తెలుస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ధమాకా దిమ్మతిరిగే కలెక్షన్స్ ను సాధించింది. ఇక సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు కేల పోవడంతో రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక మాస్ రాజా రవితేజ నుంచి ఇలాంటి హిట్ కోసమే ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. క్రాక్ సినిమా తర్వాత రవితేజ ధమాకా సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక రవితేజ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు మాస్ రాజా.

ఇవి కూడా చదవండి