AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara : కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ బింబిసార సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా..?

ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది బింబిసారా. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. థియేటర్‏లో సూపర్ హిట్‏గా నిలిచిన ఈ సినిమా అటు ఓటీటీలోనూ మంచి వ్యూస్ ను రాబట్టింది.

Bimbisara : కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ బింబిసార సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా..?
Bimbisara
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2022 | 3:51 PM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బింబిసార మూవీ ఒకటి. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది బింబిసారా. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. థియేటర్‏లో సూపర్ హిట్‏గా నిలిచిన ఈ సినిమా అటు ఓటీటీలోనూ మంచి వ్యూస్ ను రాబట్టింది. ఈ సినిమాలో టైమ్ ట్రావెలింగ్‌ సబ్జెక్ట్‌ను చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు వశిష్ట్‌. తక్కువ బడ్జెట్‌లోనే భారీ విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీని సైతం మెస్మరైజ్‌ చేసింది.

అయితే ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్ రామ్ కంటే ముందుగా మరో హీరోతో అనుకున్నారట. ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ ఈ సినిమా క‌థ‌ను ముందుగా ఓ స్టార్ హీరోకు చెప్పారని టాక్ వినిపిస్తోంది . ఆ హీరో ఎవరో కాదు మాస్ రాజా ర‌వితేజ. కథను సిద్ధం చేసుకున్న తర్వాత రవితేజకు వివరించాడట వశిష్ఠ. అయితే రవితేజ ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారని.. ఇలాంటి కథలకు తాను సూట్ అవ్వనని ఈ మూవీని రిజక్ట్ చేశారని టాక్.

ఇవి కూడా చదవండి

దాంతో ఇదే కథను కళ్యాణ్ రామ్ కు వినిపించగా ఆయన ఓకే చేయడమే కాకుండా.. తన ఓన్ బ్యానర్ అయినా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. అయితే నిజంగా రవితేజ ఈ సినిమాను రిజక్ట్ చేశారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అదే సమయంలో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రవితేజ ధమాకా సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అటు కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. అలాగే బింబిసార 2 కూడా ప్లాన్ చేస్తున్నాడు.

Follow Us
అలా ఎలా చేస్తారు? బిగ్‌బాస్‌షోపై లేడీ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు
అలా ఎలా చేస్తారు? బిగ్‌బాస్‌షోపై లేడీ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు
IND vs ENG 3rd ODI: టీమిండియా ముందు భారీ టార్గెట్..
IND vs ENG 3rd ODI: టీమిండియా ముందు భారీ టార్గెట్..
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్..
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్..
మిడిల్ బెర్త్ దొరికిందా? అత్యధిక వివాదాలు జరిగేది ఈ సీటుతోనే..
మిడిల్ బెర్త్ దొరికిందా? అత్యధిక వివాదాలు జరిగేది ఈ సీటుతోనే..
విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి.. ఫొటోస్
విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి.. ఫొటోస్
2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
మీ చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే నెలకు ఎంత నూనె వాడాలి..?
మీ చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే నెలకు ఎంత నూనె వాడాలి..?
4 ఏళ్లు ఇంచు కదలకుండా జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!
4 ఏళ్లు ఇంచు కదలకుండా జీవిస్తుంది.. నీళ్లు, తిండి అవసరమే లేదు!
పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు
పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు
వై-ఫై ఉపయోగిస్తున్నప్పుడు ఇలా అస్సలు చేయవద్దు.. ఇంటర్నెట్ వేగం డౌ
వై-ఫై ఉపయోగిస్తున్నప్పుడు ఇలా అస్సలు చేయవద్దు.. ఇంటర్నెట్ వేగం డౌ