AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నేలపై కూర్చోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.. ? వెంటనే అలవాటు చేసుకోండి..

నేలపై కూర్చోవడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది అనేక అధ్యయనాలు, పరిశోధనల ద్వారా నిరూపించబడింది. నేలపై కూర్చొని పని చేయాలని ఆయుర్వేదం కూడా సిఫార్సు చేస్తోంది.

Health Tips: నేలపై కూర్చోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.. ? వెంటనే అలవాటు చేసుకోండి..
Healthy Sitting Habits
Jyothi Gadda
|

Updated on: Dec 30, 2022 | 6:40 PM

Share

కాలం మారుతోంది. మారుతున్న జీవనశైలి, ఆధునికత వల్ల పాత సంప్రదాయాలు చాలా వరకు మరుగున పడిపోతున్నాయి. అందులో నేలపై కూర్చొని తినే అలవాటు ఒకటి. నేలపై కూర్చుని చేసే పనుల వల్ల కలిగే ప్రయోజనాలు, ఆనందం ఏమిటో నేలపై కూర్చుని చేసే వారికే తెలుస్తుంది. పూర్వం మన ఇంట్లో పెద్దలు నేలపై కూర్చొని భోజనం చేసేవారు. నేలపై కూర్చోవడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది అనేక అధ్యయనాలు, పరిశోధనల ద్వారా నిరూపించబడింది. నేలపై కూర్చొని పని చేయాలని ఆయుర్వేదం కూడా సిఫార్సు చేస్తోంది. నేలపై కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.

నేలపై కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

జీర్ణక్రియలో మెరుగుదల.. సుఖాసన యోగాసనం.. నేలపై కాలు వేసుకుని కూర్చోవడం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మనం తినడానికి ప్లేట్‌ని నేలపై ప్లేట్‌ పెట్టుకుని తినటం వల్ల శరీరాన్ని కొద్దిగా ముందుకు వంచాల్సి వస్తుంది. ఆ తర్వాత తిరిగి యధా స్థితికి వస్తాము.. పదే పదే శరీరాన్ని ముందుకు వెనుకకు వంచడం వల్ల పొట్ట కండరాలు ఉత్తేజితమై కడుపులో డైజెస్టివ్ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచి ఆహారం మెరుగ్గా జీర్ణం కావడం ప్రారంభిస్తుంది.

వెన్నెముక బలంగా మారుతుంది.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన వెన్నెముక కోసం నేలపై కూర్చోవాలి. ఇలా చేయడం ద్వారా మీరు మరింత స్థిరంగా కూర్చుంటారు. మీ వెన్నెముకపై ఒత్తిడి పడదు. నేలపై కూర్చోవడం వల్ల మన వెన్నెముక కాన్ఫిగరేషన్ మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

నేలపై కూర్చోవడం మనస్సుకు విశ్రాంతినిస్తుంది.. పద్మాసనం, సుఖాసనం ధ్యానానికి అనువైన భంగిమలు. ఈ ఆసనాలు మనస్సు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ భంగిమల్లో కూర్చోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

నేలపై కూర్చున్నప్పుడు శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మీ శరీరం, దిగువ సగం కండరాలు విస్తరించి ఉంటాయి. ఇది మన శరీరానికి స్థితిస్థాపకత, వశ్యతను ఇస్తుంది. మీ కాళ్ళకు మరింత బలాన్ని ఇస్తుంది. నేలపై కూర్చోవడం వల్ల తుంటి, కాళ్లు, వెన్నెముక సాగుతుంది, ఇది శరీరంలో సహజ వశ్యతను ప్రోత్సహిస్తుంది.

పిరుదు కండరాలు బలంగా మారతాయి.. బలహీనమైన పిరుదు మన స్థిరత్వం, సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. మీ తుంటి, వీపు బలహీనంగా ఉంటే, నేలపై ఎక్కువ సమయం కూర్చోండి. నేలపై కూర్చోవడం ద్వారా, తుంటి కండరాలు బలపడతాయి. ఇది మీ వీపును కూడా బలపరుస్తుంది.

దీర్ఘాయువుకు ఉత్తమం.. నేలపై ‘లేచి కూర్చునే’ సామర్థ్యం దీర్ఘాయువును మెరుగుపరుస్తుంది. ఇది మన మొత్తం చలన పరిధిని స్థిరీకరిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి