Rishabh pant: కాలిపోతున్న కారులోంచి పంత్‌ను కాపాడిందో ఎవరో తెలుసా…? చిరు ఉద్యోగి చేసిన గొప్ప సాహసం

అతడిని వెంటనే బయటకు లాగి.. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో చూశాను. అతడి నీలం రంగు బ్యాగ్‌, రూ.7,000 నగదును గుర్తించాం. వాటిని అంబులెన్స్‌లో అతడికి అప్పగించినట్టుగా చెప్పాడు.

Rishabh pant: కాలిపోతున్న కారులోంచి పంత్‌ను కాపాడిందో ఎవరో తెలుసా...? చిరు ఉద్యోగి చేసిన గొప్ప సాహసం
Rishabh Pant Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 30, 2022 | 5:27 PM

క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ సమీపంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ తర్వాత కారు పరిస్థితి చూస్తే, ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. కనీస ఆనవాళ్లు కూడా తెలియకుండా 70 శాతానికి పైగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌ తలకి తీవ్ర గాయమైంది. అలాగే కారు బలంగా డివైడర్‌ని ఢీకొట్టడంతో అతని వెన్నెముక, కాళ్లకు కూడా తీవ్రంగా గాయాలు తగిలాయి. రూర్కీ సమీపంలోని మహ్మద్‌పూర్ జాట్ ప్రాంతంలో పంత్ కారు ప్రమాదానికి గురైంది. మంటల్లో కాలిపోతున్న కారులోంచి ప్రాణాలకు తెగించి పంత్‌ని కాపాడింది ఒక డ్రైవర్‌. ఒక బస్సు డ్రైవర్ పంత్‌ పట్ల దైవదూతగా మారి రిషబ్ పంత్ జీవితాన్ని కాపాడాడు. డ్రైవర్ ముందుగా బస్సును ఆపి రిషబ్ పంత్‌ను కారులోంచి బయటకు తీశాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

వివరాల మేరకు.. ఆ సమయంలో తాను హరిద్వార్‌ వైపు నుంచి వస్తున్నట్టుగా బస్సు డ్రైవర్‌ సుశీల్‌ తెలిపాడు.. పంత్‌ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ వైపు నుంచి వస్తోందని చెప్పాడు. పంత్‌కారు డివైడర్‌ను ఢీకొని దాదాపు 200 మీటర్లు దూసుకెళ్లిందని చెప్పాడు. అది చూసిన వెంటనే తాను బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రమాదం జరిగిన కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లానని చెప్పాడు. అప్పటికే కారు బోల్తా కొట్టింది. పంత్‌ అప్పటికే కారు విండో నుంచి సగం బయటకు వచ్చాడు. తానొక క్రికెటర్‌నని చెప్పాడు. అతడి తల్లికి ఫోన్‌ చేయమని కోరాడు. నేను క్రికెట్‌ చూడను. అందుకే గుర్తుపట్టలేకపోయాను. కానీ, నా బస్సులోని వారు గుర్తుపట్టారు. అతడిని వెంటనే బయటకు లాగి.. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో చూశాను. అతడి నీలం రంగు బ్యాగ్‌, రూ.7,000 నగదును గుర్తించాం. వాటిని అంబులెన్స్‌లో అతడికి అప్పగించినట్టుగా బస్సు డ్రైవర్‌ సుశీల్‌ చెప్పాడు. అతని ఒంటిపై బట్టలు చిగిరిపోయి ఉండటంతో తమ షీట్లో చుట్టి అంబులెన్స్‌లో ఎక్కించినట్టుగా వివరించారు.

ప్రస్తుతం పంత్‌కు చికిత్స జరుగుతోందని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.