AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: ప్రార్థిస్తున్నా.. అంటూ హీరోయిన్‌ ఊర్వశీ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌.. నెటిజన్ల రియాక్షన్స్‌ ఇవే

పంత్ ప్రమాదానికి గురయ్యాడన్న విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. అతను త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. దీంతో ఈరోజు రిషబ్‌ పంత్ పేరు ట్రెండ్‌ అవుతోంది. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్‌ చేసింది

Urvashi Rautela: ప్రార్థిస్తున్నా.. అంటూ హీరోయిన్‌ ఊర్వశీ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌.. నెటిజన్ల రియాక్షన్స్‌ ఇవే
Urvashi Rautela
Basha Shek
|

Updated on: Dec 30, 2022 | 6:00 PM

Share

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉదయం ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా రిషబ్‌ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు రోడ్డు పక్కన నిర్మించిన డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే కారులో మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే అప్పటికే కారు గ్లాస్ పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు పంత్. కాగా పంత్ ప్రమాదానికి గురయ్యాడన్న విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. అతను త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. దీంతో ఈరోజు రిషబ్‌ పంత్ పేరు ట్రెండ్‌ అవుతోంది. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్‌ చేసింది.  పంత్  పేరు  నేరుగా ప్రస్తావించకుండా.. ప్రార్థిస్తున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

‘పంత్‌ భాయ్‌ హాస్పిటల్‌లో ఉంటే మీరు ఇలాంటి హాట్‌ ఫోటోలు షేర్‌ చేయడం తగదు.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి రిషబ్‌ను కలవండి’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. మరొకరు ‘ప్రమాదం జరిగిన సమయంలో ఇలాంటి పోస్టులు పెట్టద్దు’ అని రియాక్ట్‌ అయ్యారు. కాగా ఊర్వశీ-రిషభ్‌ పంత్‌ మధ్య గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో కోల్డ్‌వార్‌ నెలకొన్న సంగతి తెలిసిందే. డైరెక్టుగా పంత్ పేరు చెప్పకుండానే ‘ఆర్పీ’ అనే పేరుతో ఊర్వశి పోస్టులు చేయడం, దానికి తగ్గట్టుగానే పంత్‌ రియాక్ట్‌ అవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. మొదట తనకోసం ఓ హోటల్‌లో ఆర్పీ చాలా సేపు ఎదురుచూశాడని బాలీవుడ్‌ బ్యూటీ పోస్ట్‌ పెట్టగా.. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ వాడతారని, ఇలాంటి వాళ్లనే చూస్తే జాలేస్తుందని పంత్‌ ఊర్వశీని ఉద్దేశిస్తూ ఆ మధ్య పోస్ట్‌ చేసిన సంగతి విదితమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!