విరిగిన వేలు.. చేతినిండా రక్తం.. అయినా వెనక్కు తగ్గలే.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న 17.5 కోట్ల ప్లేయర్
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు రెండో రోజు ఎన్రిక్ నోర్కియా వేసిన హై స్పీడ్ బంతికి క్యామెరూన్ వేలు విరిగింది. రక్తం ధారలా కారింది. దీంతో వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రంగా ఉందని, అతను ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేయడని వార్తలు వచ్చాయి. తదుపరి మ్యాచ్‌కు దూరమవుతాడని కూడా అన్నారు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కెమెరూన్ గ్రీన్ అర్ధసెంచరీతో రాణించాడు. మొత్తం177 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా తన జట్టుకు భారీ స్కోరును అందించాడు. అయితే ఇందులో వింతేముంది? అనుకుంటున్నారు. అతను చేతి గాయంతోనే బరిలోకి దిగాడు. సఫారీ బౌలర్ల అటాక్‌ను తట్టుకుని మరీ గంటలపాటు క్రీజులో నిలబడ్డాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు రెండో రోజు ఎన్రిక్ నోర్కియా వేసిన హై స్పీడ్ బంతికి క్యామెరూన్ వేలు విరిగింది. రక్తం ధారలా కారింది. దీంతో వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రంగా ఉందని, అతను ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేయడని వార్తలు వచ్చాయి. తదుపరి మ్యాచ్‌కు దూరమవుతాడని కూడా అన్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ బ్యాటింగ్‌కు దిగాడు ఈ స్టార్ ఆల్‌రౌండర్. అర్ధసెంచరీతో రాణించాడు. టీ20ల్లో దూకుడుగా ఆడే అతను ఈ మ్యాచ్‌లో మాత్రం టెస్టు ఫార్మాట్టుకు తగ్గట్టుగా ఆచితూచి నిదానంగా ఆడాడు. అలాగనీ మరీ రక్షణాత్మకంగా ఆడలేదు. సులువైన బంతులను నేరుగా బౌండరీకి తరలించాడు. అలా 5 బౌండరీలతో అర్ధసెంచరీ చేయగానే కెప్టెన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లు వెచ్చించి గ్రీన్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు నడ్డి విరిచాడు. తద్వారా కెరీర్‌లో మొదటిసారి ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే..మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 189 పరుగులకే ఆలౌటైంది. ఆతర్వాత డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ, అలెక్స్ కారీ సెంచరీ, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, గ్రీన్ హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 575 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో 386 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. కాగా మూడోరోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది.
Grit and determination. And a half-century to boot, the fifth of Australia’s innings #AUSvSA
— cricket.com.au (@cricketcomau) December 28, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..