Ind W vs SA W: 4 ఓవర్లు.. 15 రన్స్.. 3 వికెట్లు.. సఫారీల నడ్డి విరిచిన తెలుగమ్మాయి.. తొలి టీ20లో టీమిండియా విజయం
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో ఆంధ్రా అమ్మాయి ఎండీ షబ్నమ్ సత్తాచాటింది. మూడు వికెట్ల పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. షబ్నమ్ రాణించడంతో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్-19 మహిళల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో ఆంధ్రా అమ్మాయి ఎండీ షబ్నమ్ సత్తాచాటింది. మూడు వికెట్ల పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్-19 మహిళల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంతో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత అండర్-19 మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ షఫాలీ వర్మ (0) పేలవమైన ఫామ్ కొనసాగించింది. అయితే శ్వేత (39 బంతుల్లో 40; 5 ఫోర్లు), సౌమ్య (46 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (15) ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో హ్లుబి, కేలా రేనకె చెరో 2 వికెట్లు తీశారు. కాగా తక్కువ టార్గెట్ను ఛేదించడానికి బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలను భారత బౌలర్లు కట్టడి చేశారు. పరుగులు నియంత్రించడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేసింది.
కాగా ఈ మ్యాచ్‌లో విశాఖపట్నానికి చెందిన సీమర్ ఎండీ షబ్నమ్ చెలరేగింది. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చిన ఆమె మూడు వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచింది. ఆమెకు తోడు అర్చనా దేవి (3/14) కూడా చెలరేగడంతో టీమిండియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ సిరీస్ తర్వాత జనవరి 14 నుంచి 29 వరకు తొలి సారి అండర్–19 మహిళల టి20 దక్షిణాఫ్రికాలోనే జరగనుంది. ఈ ప్రతిష్ఠా్త్మక టోర్నీకి సన్నాహకాల్లోనే భాగంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
#TeamIndia clinch a comprehensive 5️⃣4️⃣-run win against SA U19 Women at the Steyn City Ground & take a 1️⃣-0️⃣ lead in the 5️⃣-match #SAvIND T20I series ????
4️⃣0️⃣ runs each with the bat from Shweta Sehrawat & Soumya Tiwari ??
3️⃣ wickets apiece for Shabnam Shakil & Archana Devi ?? pic.twitter.com/5cjRF5TzPP
— BCCI Women (@BCCIWomen) December 27, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..