Tunisha Sharma Death case: తునీషాను షీజన్ ఖాన్ కుటుంబం బ్లాక్ మెయిల్ చేసింది.. సంచలన విషయాలను బయటపెట్టిన నటి తల్లి..
అలి బాబా దస్తాన్ ఇ కాబుల్ సీరియల్ సెట్ లోని మేకప్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది తునీషా శర్మ. అయితే తన కూతురు మరణానికి కారణం ఆమె మాజీ ప్రియుడు షీజన్ ఖాన్ అని తునీషా తల్లి ఆరోపించింది. దీంతో అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
సీరియల్ నటి తునీషా శర్మ అకాల మరణం యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. 20 ఏళ్ల వయసున్న ఆమె డిసెంబర్ 24న తాను నటిస్తున్న అలి బాబా దస్తాన్ ఇ కాబుల్ సీరియల్ సెట్ లోని మేకప్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతురు మరణానికి కారణం ఆమె మాజీ ప్రియుడు షీజన్ ఖాన్ అని తునీషా తల్లి ఆరోపించింది. దీంతో అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. షీజన్ నుంచి అన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా మరోసారి తన కూతురు మరణం పట్ల.. నిందితుడు షీజన్ గురించి మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టారు తునీషా శర్మ తల్లి. ఆమె మృతిని హత్యగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు తునీషా బంధువులు.
ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తునీషా శర్మ తల్లి మాట్లాడుతూ.. షీజన్ తో ప్రేమలో ఉన్న సమయంలో తన కూతురు ఎలా మారిపోయిందో వివరించింది. అలాగే షీజన్ తన కూతురిని బ్లాక్ మెయిల్ చేశారని.. ఆమెకు ఉర్దూ కూడా నేర్పించారని.. దీంతో ఆమె మెల్లగా ఉర్దూ మాట్లాడటం ప్రారంభించిందని అన్నారు. ” నాకు ఉన్న ఒకే ఒక్క కూతురిని పోగొట్టుకున్నాను. అతడిని నేను ఎప్పటికీ బయటకు రానివ్వను. ముందే అడిగాను..అతడిని మా అమ్మాయి కాకుండా మీకు జీవితంలో మరో సంబంధం ఉంటే చెప్పండి అని.. కానీ అతను ఏం చెప్పలేదు. తునీషాను అతని కుటుంబానికి దగ్గర చేశాడు. దీంతో ఆమె నాకు మెల్ల మెల్లగా దూరమయ్యింది. షీజన్ గురించి నా కూతురిని పలుమార్లు అడిగాను. కానీ తను నాకు ఏం చెప్పలేదు.
అతను తునీషాను ట్రాప్ చేశాడు. ఆమెను షీజన్ కుటుంబం బ్లాక్ మెయిల్ చేసింది. ఆమెకు ఉర్దూ కూడా నేర్పించారు. దీంతో మెల్లగా ఆమె ఉర్దూ మాట్లాడటం ప్రారంభించింది.” అంటూ చెప్పుకొచ్చింది. అయితే తునీషా తల్లి ఆరోపణలపై షీజన్ కుటుంబం ఇంకా స్పందించలేదు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.