Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth: నా తల్లితో చాలా దురుసుగా మాట్లాడారు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ ?.. ఎయిర్ పోర్ట్ అధికారులపై సిద్ధార్థ్ ఆగ్రహం..

ఆరోజు తన ఫ్యామిలీకి..అధికారులకు జరిగిన విషయాన్ని వివరించారు. పర్సులో ఉన్న నాణేలు ఖాళీ చేయమని అధికారులు తన తల్లిని అడిగారని.. సిరంజిలు ఉన్నాయని.. ఎవరికీ అనారోగ్యంగా ఉందని తన సోదరిని ప్రశ్నించారని..నాకే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నించారు సిద్ధార్థ్.

Siddharth: నా తల్లితో చాలా దురుసుగా మాట్లాడారు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ ?.. ఎయిర్ పోర్ట్ అధికారులపై సిద్ధార్థ్ ఆగ్రహం..
Siddharth
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 30, 2022 | 6:46 AM

తన కుటుంబానికి ఇటీవల మధురై ఎయిర్ పోర్టులో జరిగిన అవమానం గురించి టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మధురై విమానాశ్రయంలో తన కుటుంబం పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారని.. గంటలపాటు తమ బ్యాగులు చెక్ చేస్తూ.. తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారంటూ సిద్ధార్థ్ ఆరోపించారు. తాజాగా మరోసారి ఇదే వివాదం గురించి సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఆరోజు తన ఫ్యామిలీకి..అధికారులకు జరిగిన విషయాన్ని వివరించారు. పర్సులో ఉన్న నాణేలు ఖాళీ చేయమని అధికారులు తన తల్లిని అడిగారని.. సిరంజిలు ఉన్నాయని.. ఎవరికీ అనారోగ్యంగా ఉందని తన సోదరిని ప్రశ్నించారని..నాకే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే… ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నించారు సిద్ధార్థ్.

” ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. వయసు పైబడిన వారు.. చిన్నపిల్లలతో మా కుటుంబమంతా కలిసి మధురై ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో సెక్యరిటీ లైన్ ఖాళీగానే ఉంది. మేం లైన్ లోకి వెళ్లగానే సీఐఎస్ఎఫ్ సిబ్బందిలోని ఒకరు మా ఐడీలను తదేకంగా పరిశీలించారు. నా ఆధార్ కార్టు తీసుకుని అనుమానంగా చూస్తూ ఇది మీరేనా.. అంటూ గట్టిగా ప్రశ్నించారు. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారు ? అని అడగ్గా.. తమకు అనుమానంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత మరో అధికారి వచ్చి మా బ్యాగ్స్ చెక్ చేశారు. ఎందుకు అలా చేస్తున్నారని మరోసారి ప్రశ్నించగా.. ఇది మధురై ఎయిర్ పోర్ట్. ఇక్కడ ఇలాంటి రూల్స్ మాత్రమే ఉంటాయంటూ దురుసుగా ప్రవర్తించారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మా అమ్మ పర్స్ లో నాణేలు ఉన్నాయని తెలుసుకుని వాటిని బయటకు తీయమని గట్టిగా చెప్పారు. 70 ఏళ్ల మహిళతో ఇలా దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ ? మా సోదరి బ్యాగ్ లో ఉన్న సిరంజీలు చూసి ఇవి ఎందుకు ? ఎవరికి అనారోగ్యం ఉంది ? ఏంటీ సమస్య ? అని అందరి ఎదుట ప్రశ్నించారు. ఒకరి వ్యక్తిగత సమస్యను అందరి ఎదుట ఎలా బయటపెట్టాలని చూస్తారు ? ఈ ఘటనతో విసిగిపోయి పై అదికారిని పిలవమని అడిగాను. దాంతో ఓ అధికారి నా వద్దకు వచ్చారు. వెంటనే నా మాస్క్ తీసి మాట్లాడగా.. అతను గుర్తుపట్టి.. సర్ నేను మీకు పెద్ద అభిమానిని అని చెప్పారు. జరిగిన దానికి చింతిస్తున్నానని.. క్షమాపణలు తెలిపారు. ఇది సరైన పద్దతి కాదని.. నన్ను అభిమానిస్తున్నారు కాబట్టి క్షమాపణలు చెప్పారు. మరీ సాధారణ ప్రజలకు ఇలాంటి వేధింపులే ఎదురైతే ఏంటీ పరిస్థితి ? అని అడిగి వచ్చేశా” అంటూ చెప్పుకొచ్చారు సిద్ధార్థ్. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.