Dhanya Balakrishna: ఆ డైరెక్టర్‏తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ మ్యారెజ్.. కోర్టులో నిజం చెప్పేసిన దర్శకుడు..

ధన్య .. పెళ్లై.. విడాకులు తీసుకున్న ఓ దర్శకుడిని వివాహం చేసుకుందంటూ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది నటి కల్పిక గణేశ్. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తన యూట్యూబ్

Dhanya Balakrishna: ఆ డైరెక్టర్‏తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ మ్యారెజ్.. కోర్టులో నిజం చెప్పేసిన దర్శకుడు..
Dhanya Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 29, 2022 | 7:58 AM

తెలుగు ప్రేక్షకులకు ధన్య బాలకృష్ణ సుపరిచితమైన పేరు. తమిళం, కన్నడ, మలయాళ చిత్రపరిశ్రమలో వరుస సినిమాల్లో నటిస్తున్న ఆమె.. తెలుగులో సాఫ్ట్ వేరు సుధీర్, నేను శైలజ, రాజు గారి గది, కార్బన్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అటు వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ పలు వెబ్ సిరీస్ చేస్తూ రాణిస్తోంది. అయితే ధన్య .. పెళ్లై.. విడాకులు తీసుకున్న ఓ దర్శకుడిని వివాహం చేసుకుందంటూ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది నటి కల్పిక గణేశ్. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇక ఆ తర్వాత ధన్య, కల్పిక మధ్య మాటల యుద్ధం నడిచింది. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తమ పెళ్లి నిజమే అని డైరెక్టర్ బాలాజీ మోహన్ నిర్ధారించారు. తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు.

నటి కల్పిక తన వ్యక్తిగత జీవితం గురించి తరచూ బహిరంగంగా మాట్లాడుతోందని మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు డైరెక్టర్ బాలాజీ మోహన్. తమకు ఏడాది క్రితమే వివాహం జరిగిందని.. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే ధన్యను వివాహం చేసుకున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. తమ వ్యక్తిగత విషయాలను తీస్తూ.. తమ పరువుకు భంగం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేసిందని ఆరోపించారు. అయితే వీరిద్దరి పెళ్లి గురించి ఎందుకు బయటపెట్టలేదనేది తెలియాల్సి ఉంది. బాలాజీ మోహన్ కిది రెండో వివాహం. ఇదివరకే ఆయన అరుణను వివాహం చేసుకున్నారు. మారి, మారి 2 , వాయై మూడి పేసవుం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

ఎట్టకేలకు ధన్య బాలకృష్ణ గురించి నటి కల్పిక చేసిన వ్యాఖ్యలు నిజమని తెల్చేశారు డైరెక్టర్ బాలాజీ మోహన్. తామిద్దరం రహస్యంగానే పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.