AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tunisha Sharma: ‘తునీషాది ఆత్మహత్య కాదు.. హత్యే’.. సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..

తునీషా మరణంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన ఇన్ స్టా వేదికగా స్పందిస్తూ.. సుధీర్ఘ పోస్ట్ చేసింది. తునీషాది ఆత్మహత్య కాదని.. ఆమె హత్య అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Tunisha Sharma: 'తునీషాది ఆత్మహత్య కాదు.. హత్యే'.. సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..
Kangana Ranaut, Tunisha Sha
Rajitha Chanti
|

Updated on: Dec 29, 2022 | 7:02 AM

Share

బాలీవుడ్ సీరియల్ నటి తునీషా శర్మది ఆత్మహత్య కాదని.. హత్యే అని అన్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. స్త్రీ అన్నింటినీ తట్టుకోగలదని.. కానీ వారిని ఇప్పటికీ మానసికంగా, శారీరకంగా కుంగదీస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. తునీషా తాను నటిస్తోన్న అలీ బాబా: దస్తాన్ ఇ కాబుల్ సీరియల్ సెట్ లోని మేకప్ రూంలో ఉరివేసుకుని చనిపోయింది. 20 ఏళ్ల తునీషా అకాల మరణం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ఆమె ఆత్మహత్య కేసును ప్రస్తుతం ముంబై పోలీసులు విచారిస్తున్నారు. తన కూతురి మృతికి ఆమె మాజీ ప్రియుడు షీజన్ ఖాన్ కారణమంటూ తునీషా తల్లి ఆరోపించడంతో అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు.. తునీషా మరణంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన ఇన్ స్టా వేదికగా స్పందిస్తూ.. సుధీర్ఘ పోస్ట్ చేసింది. తునీషాది ఆత్మహత్య కాదని.. ఆమె హత్య అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

“ఒక స్త్రీ ప్రేమ, వివాహం, ప్రేమలో విఫలమైనా, వివాహా బంధంలో ఆటుపోటులనైనా ఎదుర్కోగలదు.. కానీ ఒక మహిళకు నిజమైన ప్రేమ ఎప్పుడూ లభించడంలేదు. వారిని శారీరకంగా, మానసికంగా మరింత కుంగదీస్తున్నారు. వారికి ఎదురయ్యే అనుభవాలు వారి కలలు, ఊహలపై ప్రభావం చూపుతున్నాయి. మన ఆడపిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ బాధ్యత ప్రభుత్వంపైన కూడా ఉంది. స్త్రీలకు భద్రతలేని భూమి వినాశనానికి గురువుతుంది. మహిళలపై యాసిడ్ దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలి. అలాంటి వారికి విచక్షణ లేకుండా మరణిశిక్ష విధించాలి. చట్టపరమైన మోసాలను ఎలా పరిష్కరిస్తారో, ఆర్థికమోసాలను ఎలా డీల్ చేస్తారో.. అలాగే భావోద్వేగ మోసాలపై కూడా అధే విధంగా ప్రవర్తించాలి. రూమర్స్ చిన్నవే కదా అని కొట్టిపారేస్తారు. కానీ అవన్నీ అబద్ధాలు. అవి మనిషికి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో వారికి మాత్రమే తెలుస్తోంది. కొందరికి పక్కవారి ఎమోషన్స్ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. కానీ సున్నితమనస్కులపై అవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది.

Kangana

Kangana

స్త్రీలను మానసికంగా, శారీరకంగా ఉపయోగించుకోవడానికి మరో వ్యక్తికి అవకాశం లేదు. అలాంటి సమయంలో ఓ స్త్రీ తన సొంత నిర్ణయాలను నమ్మదు.. జీవితాంతం ఉండడం.. లేదా చనిపోవడం రెండింటికి వ్యత్సాసం లేదని.. ఆమె తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంటుంది. తునీషాది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా రనౌత్.. చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.