AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : డార్లింగ్ మనసులో ఉన్నది కేవలం ఇద్దరు డైరెక్టర్లే.. ఆ దర్శకుడితో పనిచేయాలని ప్రభాస్ వెయిటింగ్ అంట..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మనసులో ఉన్నది ఇద్దరు దర్శకులు మాత్రమే. వారిద్దరు తన ఫేవరేట్ అని.. ఎప్పటికైన అందులో ఒకరితో వర్క్ చేయాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టారు డార్లింగ్. ఇంతకీ అందులో రాజమౌళి ఉన్నారేమో చూద్దాం.

Prabhas : డార్లింగ్ మనసులో ఉన్నది కేవలం ఇద్దరు డైరెక్టర్లే.. ఆ దర్శకుడితో పనిచేయాలని ప్రభాస్ వెయిటింగ్ అంట..
Prabhas, Balakrishna
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2022 | 9:13 AM

Share

మొదటిసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నందమూరి నటసింహం బాలకృష్ణ కలిసి సందడి చేసిన ఒకే వేదిక అన్ స్టాపబుల్ సీజన్ 2. ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో వీరిద్దరి ఎపిసోడ్ డిసెంబర్ 29న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. దీనికి డార్లింగ్ అభిమానుల నుంచి ఊహించని క్రేజ్ వచ్చేసింది. గతంలో వదిలిన రెండు ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రీరిలీజ్ ఈవెంట్స్… ఇంటర్వ్యూలలో చాలా తక్కువగా కేవలం సినిమాల గురించి మాట్లాడే ప్రభాస్.. మొదటి సారి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడినట్లుగా ప్రోమోలో చూపించడం… రామ్ చరణ్, గోపిచంద్, బాలయ్య కలిసి డార్లింగ్ ను ఓ ఆటాడుకోవడం ఈ ప్రోమోలకు మరింత హైలెట్ అయ్యాయి.. దీంతో ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు ఫ్యాన్స్. ఇక డార్లింగ్ అభిమానుల కోరిక మేరకు డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కావాల్సిన ఎపిసోడ్ ను డిసెంబర్ 29న రాత్రి రిలీజ్ చేయనున్నట్లుగా ఆహా ముందుగానే ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు యాప్ క్రాష్ అయ్యింది. దీంతో ఎపిసోడ్ ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యింది.

ఇందులో ప్రభాస్ తన బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసుకోగా.. ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. అలాగే కెరీర్ లో ఏ దర్శకుడితో కలిసి పనిచేయాలనుకుంటున్నావని బాలయ్య అడగ్గా.. వెంటనే మణిరత్నం అని సమాధానమిచ్చారు డార్లింగ్. ఆయనను చాలా ఆరాధిస్తానని చెప్పాడు. అయితే భవిష్యత్తులో తను మణిరత్నంతో కలిసి పనిచేస్తానో లేదో తెలియదు.. కానీ కలిసి పనిచేయాలని మాత్రం ఉందని తెలిపారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు కొన్ని అద్భుతమైన చిత్రాలను అందించిన లెజెండరీ డైరెక్టర్ బాబు అంటూ తనకు చాలా ఇష్టమని.. ఆయనకు వీరాభిమానని చెప్పారు. ఆయనపై ఉన్న నమ్మకంతోనే తాను శ్రీరామరాజ్యం చేశానని బాలకృష్ణ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కు మధ్య తనకు ఎలాంటి ప్రేమ లేదని.. కేవలం తామిద్దరం మంచి స్నేహితులమని అన్నారు ప్రభాస్. ఇప్పటికే తమ గురించి వస్తున్న రూమర్లకు కృతి క్లారిటీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు ప్రభాస్. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?