Smriti Mandhana: 8 ఫోర్లు, 3 సిక్సర్లు.. 32 బంతుల్లోనే 61 రన్స్‌.. కట్‌ చేస్తే మరో ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో..

కామన్వెల్త్‌ గేమ్స్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌పై స్మృతి చెలరేగిన తీరు అందరికీ గుర్తుండిపోతుంది. ఆ మ్యాచ్‌లో బ్రిటిష్‌ బౌలర్ల భరతం పట్టిన మంధాన 23 బంతుల్లో అర్ధసెంచరీ చేసింది. తద్వారా ఫాస్టెస్ట్‌ పిఫ్టీ చేసిన టీమిండియా బ్యాటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

Smriti Mandhana: 8 ఫోర్లు, 3 సిక్సర్లు.. 32 బంతుల్లోనే 61 రన్స్‌.. కట్‌ చేస్తే మరో ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో..
Smriti Mandhana
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2022 | 6:01 PM

టీమిండియా మహిళా క్రికెటర్‌, స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం రేసులో నిలిచింది. ఫార్మాట్‌ ఏదైనా పరుగుల వర్షం కురిపిస్తోన్న ఆమె ఈ ఏడాది ఐసీసీ ‘టీ 20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. స్మృతితో పాటు నిదా దార్‌ (పాకిస్తాన్‌), సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌), తాహ్లియా మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా)లతో ఈ జాబితాలో ఉన్నారు. కాగా ఈ ఏడాది పొట్టి క్రికెట్‌లో అద్భుతంగా రాణించింది. ఏకంగా 2500 పరుగులు చేసింది. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్, టీ20 ఆసియా కప్‌ టోర్నీల్లోనూ మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా కామన్వెల్త్‌ గేమ్స్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌పై స్మృతి చెలరేగిన తీరు అందరికీ గుర్తుండిపోతుంది. ఆ మ్యాచ్‌లో బ్రిటిష్‌ బౌలర్ల భరతం పట్టిన మంధాన 23 బంతుల్లో అర్ధసెంచరీ చేసింది. తద్వారా ఫాస్టెస్ట్‌ పిఫ్టీ చేసిన టీమిండియా బ్యాటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈమ్యాచ్‌లో మొత్తం 32 బంతులు ఎదుర్కొన్న స్మృతి 61 రన్స్‌ చేసింది. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ జట్టును ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇక ఇటీవల ఆస్ట్రేలియా అమ్మాయిలతో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో టీమిండియా ఓడిపోయినా స్మృతి నిలకడగా రాణించింది. ముఖ్యంగా రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించింది. 188 పరుగుల లక్ష్యఛేదనలో 49 బంతుల్లో 79 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌ 187 స్కోరును భారత్‌ సమం చేయగలిగింది. ఇక సూపర్‌ ఓవర్లోనూ కీలకమైన 13 (4, 6, 3) పరుగుల వల్లే భారత్‌ 20/1 స్కోరు చేసింది. తర్వాత ఆసీస్‌ 16/1 స్కోరుకే పరిమితమైంది. దీంతో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక పురుషుల టీ20 క్రికెట్‌ విభాగంలో డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ప్రతిష్టాత్మక అవార్డు పురస్కారం రేసులో నిలిచాడు. సూర్యతో సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్‌), సికందర్‌ రజా (జింబాబ్వే) కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..