Diabetes Control Tips: ఈ పండు, ఆకును తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.. ఎన్నైనా తినోచ్చు..!

పైగా ఈ చలికాలంలో ఈ పండుకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినడానికి రుచిగా ఉండటమే కాదు..మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Diabetes Control Tips: ఈ పండు, ఆకును తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.. ఎన్నైనా తినోచ్చు..!
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 30, 2022 | 6:33 PM

ప్యాంక్రియాస్ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించినప్పుడు, ఆపివేసినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల తరచుగా దాహం వేయడం, గాయాలు త్వరగా మానకపోవడం, తరచుగా మూత్రవిసర్జన, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, ముఖ్యంగా మధుమేహాన్ని వదిలించుకోవడానికి ఇంకా సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేదు. ఒక్కసారి మధుమేహం వస్తే దాన్ని అదుపులో ఉంచుకోవడమే పరిష్కారం. ఈ వ్యాధి నియంత్రణలో లేనప్పుడు ఇది శరీరంలోని ఇతర భాగాలను దెబ్బతీస్తుంది. దీనిని నివారించేందుకు అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేద చికిత్సను కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం, శారీరక శ్రమను పెంచడం మంచిది. చలికాలంలో బేరిపండ్లు పుష్కలంగా లభిస్లాయి. పైగా ఈ చలికాలంలో ఈ పండుకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినడానికి రుచిగా ఉండటమే కాదు..మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. బేరి పండు మాత్రమే కాదు, ఈ పండు ఆకులు కూడా మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఈ పండ్లు ఎంత తిన్నా బరువు పెరగరు.

బేరి ఆకులలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకు రసంలో యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా జపాన్, చైనా, కొరియా, తైవాన్‌తో సహా అనేక దేశాలలో మధుమేహాన్ని నియంత్రించడానికి బేరి ఆకులతో చేసిన టీని ఉపయోగిస్తారు. డయాబెటిస్ పేషెంట్లు దీన్ని చక్కగా తినవచ్చు. హార్ట్ పేషెంట్లు కూడా తినవచ్చు.

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో బేరి సీడ్ జ్యూస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు, ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. డయేరియాలో ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ టీని తీసుకోవడం వల్ల స్థూలకాయం, పొట్ట కొవ్వు క్రమంగా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.