AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark spots on face: డార్క్‌ స్పాట్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? కారణాలు.. నివారణ చర్యలు తెలుసుకోండి…

డార్క్ స్పాట్స్ ప్రధాన కారణాల్లో ఎక్కువ సూర్యరశ్మికి గురికావడం. దీన్నే సన్ డ్యామేజ్, సన్‌స్పాట్‌లు అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు, హార్మోన్ మార్పు కూడా మచ్చలకు కారణం అవుతుంది. ఇది మెలస్మా అనే చర్మ పరిస్థితికి కారణమవుతుంది.

Dark spots on face: డార్క్‌ స్పాట్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? కారణాలు.. నివారణ చర్యలు తెలుసుకోండి...
Dark Spots
Jyothi Gadda
|

Updated on: Dec 29, 2022 | 1:42 PM

Share

డార్క్ స్పాట్స్ దీనిని హైపర్పిగ్మెంటేషన్ అని కూడా పిలుస్తారు.. ఒక నిర్దిష్ట ప్రాంతంలో సాధారణం కంటే యాక్సెస్ మొత్తంలో మెలనిన్ ఉత్పత్తి అయినప్పుడు చర్మంపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. స్పష్టంగా చెప్పాలంటే, డార్క్ స్పాట్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, చాలా మంది డార్క్‌ స్పాట్స్‌ వల్ల ఆందోళనకు గురవుతుంటారు. తిరిగి తమ ముఖం పూర్వంలా మారిపోవాలని కోరుకుంటారు. శరీరంలోని ఏ భాగానైనా డార్క్ స్పాట్స్ ఏర్పడవచ్చు. కానీ, తరచుగా సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలు ముఖం, చేతులు వంటివి చాలా హాని కలిగిస్తాయి. అలాంటి డార్క్ స్పాట్స్ ప్రధాన కారణాల్లో ఎక్కువ సూర్యరశ్మికి గురికావడం. దీన్నే సన్ డ్యామేజ్, సన్‌స్పాట్‌లు అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు, హార్మోన్ మార్పు కూడా మచ్చలకు కారణం అవుతుంది. ఇది మెలస్మా అనే చర్మ పరిస్థితికి కారణమవుతుంది. ఇది చర్మం రంగు మారడం, చిన్న పాచెస్ వంటివి ప్రేరేపిస్తుంది. ఇంకా, కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా డార్క్ స్పాట్స్ ఏర్పడవచ్చు. కొన్నిసార్లు కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మానికి చికాకు కలిగిస్తాయి. దీని ఫలితంగా డార్క్ ప్యాచ్‌లు ఏర్పడతాయి.

డార్క్ స్పాట్‌లను తొలగించుకోవటానికి చిట్కాలు.. క్రీమ్‌లు, సీరమ్‌లు రెటినోల్ వంటి అనేక పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మం హైపర్‌పిగ్మెంటేషన్‌తో పోరాడటానికి, కొత్త చర్మం, పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. గ్లైకోలిక్ యాసిడ్ కలిగిన ఫేస్ క్లెన్సర్ మీ ముఖాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. టాక్సిన్స్‌ని తొలగిస్తుంది. మీకు కాంతివంతమైన చర్మాన్ని ఇస్తుంది. సూర్యుడి నుండి చర్మాన్ని రక్షించే విషయానికి వస్తే, సన్‌స్క్రీన్‌లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి హానికరమైన UV కిరణాలను చర్మంపైకి రాకుండా అడ్డుకుంటాయి. సూర్యుని ప్రేరిత నల్ల మచ్చల పెరుగుదలను నిరోధిస్తాయి.

విటమిన్ సి-కలిగిన సీరమ్‌లు డార్క్ స్పాట్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. మెలనిన్ ఉత్పత్తి విటమిన్ సి ద్వారా సాధారణీకరించబడుతుంది. ఇది నల్ల మచ్చలను కూడా నివారిస్తుంది. బలమైన ఆమ్ల ఎక్స్‌ఫోలియేటింగ్ పీలింగ్ సొల్యూషన్‌లు అసమానతలను సరిచేయడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి. అవి చర్మం పై పొరను తీసివేసి, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మం మధ్య పొరను లోతుగా చొచ్చుకుపోతాయి, చర్మం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నియాసినామైడ్, విటమిన్ B3 ప్రభావవంతంగా ప్రకాశవంతంగా, నల్ల మచ్చలను వదిలించుకోవడానికి కలిసి పనిచేస్తాయి. ఇది చర్మం ఉపరితలంపై సిరామైడ్‌ల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. తేమను నిలుపుకునే చర్మం సామర్థ్యానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, చురుకైన రూపాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.